Advertisement
Google Ads BL

నాగబాబు క్విట్స్ జబర్దస్త్: మరో ఆసక్తికర విషయం


అనతి కాలంలోనే టాప్ కామెడీ షో ఎదిగి మంచి ఆదరణ పొందిన షో జబర్దస్త్. ఒక్క మాటలో చెప్పాలంటే బహుశా షో ఈ రేంజ్‌లో నడుస్తుందని.. ఇంతకాలం నెట్టుకొస్తామని సదరు షో నిర్వహిస్తున్న యాజమాన్యం కానీ.. ప్రసారం చేసుకునే యాజమాన్యం సైతం ఊహించి ఉండదేమో మరి. అయితే ఇప్పుడు ఆ షో ఏ మేరకు నడుస్తుందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు కారణం షోలోని కమెడియన్స్ మొదలుకుని జడ్జ్ వరకూ సైడ్ అవ్వడమే ఇందుకు కారణం. అసలు జబర్దస్త్‌కు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది..? నిజంగానే యాజమాన్యంతో నవ్వుల నవాబు నాగబాబుకు గొడవలొచ్చాయా..? అనే విషయాలను ఇప్పటికే ఓ వీడియోలో వివరించిన నాగబాబు.. తాజాగా మరో వీడియోలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

Advertisement
CJ Advs

ఆయన ఎందుకు దూరమయ్యారు..? అసలు కారణాలేంటి..? అనేది మాత్రం చెప్పట్లేదు కానీ.. ఏవేవో.. ఎప్పుడెప్పుడో జరిగిన పురాణాలన్నీ చెప్పుకొస్తున్నాడు. తాజా వీడియోలో ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎలా వచ్చింది..?.. రచ్చరవికి యాక్సిడెంట్‌కు ఆర్ధికసాయం.. సుధీర్, రచ్చ రవిల వ్యవహారం.. జబర్దస్త్ సక్సెస్ క్రెడిట్‌లో సంజీవ్‌తో పాటు నితిన్ ఉన్నారని.. కమెడియన్ వేణును ఓ వర్గం వారు కొట్టిన వైనం.. ఇలా పలు విషయాలను ఈ వీడియోలో మోగా బ్రదర్ చెప్పాడు. అయితే వేణును ఎందుకు కొట్టారు..? అసలు ఆరోజు ఏం జరిగింది..? అనేది తర్వాత వీడియోలో క్లారిటీగా చెబుతునానని నాగబాబు పేర్కొన్నాడు.

నేనే సెట్ చేసేవాడిని!

‘జబర్దస్త్‌లో ఉన్న నేను నాతో పాటు ఉన్న మిగతావాళ్లు ఇది శ్యాం ప్రసాద్ రెడ్డి షో.. మల్లెమాల వారిది అని ఈటీవీ వాళ్లది అని ఎప్పుడూ ఫీల్ కాలేదు. జబర్దస్త్ అంటే నా ప్రోగ్రామ్.. మన ప్రోగ్రామ్ అనే అనుకున్నాం. తప్పు జరిగినా ఒప్పు జరిగినా చర్చించుకునేవాళ్లు. కొన్ని సందర్భాల్లో కుర్రాళ్ల మధ్య విభేదాలు వచ్చేవి.. వాటిపై ఆఫ్ ది రికార్డ్ సెట్ చేసేవాడిని’ అని నాగబాబు తెలిపాడు. అయితే యూట్యూబ్‌లో ఒక్కో వీడియోను విడుదల చేస్తున్నప్పటికీ అవి తన ఛానల్‌ను ప్రమోట్ చేసుకోవడానికే తప్ప.. ఆయన ఎందుకు బయటకు రావాల్సివచ్చింది.. అనే విషయం చెప్పకుండా ఈ నాన్చుడేంటి నాగబాబు అంటూ నెటిజన్లు కన్నెర్రజేస్తున్నారు.

Naga Babu Reveals SAD Moments From Jabardasth Show:

<span>Naga Babu Reveals SAD Moments From Jabardasth Show</span> <div><span><br /></span></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs