Advertisement
Google Ads BL

‘మేరా దోస్త్’ టీజర్ విడుదల!


పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకం పై  పి .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం ‘మేరా దోస్త్’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో  ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ... ‘‘టీజర్ చాలా  బావుంది. నిర్మాత ఎంతో అభిరుచితో సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన మంచి డాక్టర్, సోషల్ రెస్పాన్స్ బిలిటీతో ఉండే వ్యక్త్తి. మంచి కంటెంట్ తో సినిమా తీసి ఉంటారని అనుకుంటున్నా. డైరెక్టర్ కి, యూనిట్  అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.  

Advertisement
CJ Advs

నిర్మాత పి.వీర రెడ్డి  మాట్లాడుతూ... ‘‘డైరెక్టర్ చెప్పిన స్టోరీ నచ్చి సినిమా తీసాను. సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.  

డైరెక్టర్ జి. మురళి మాట్లాడుతూ... ‘‘నిర్మాత ఎంతో క్లారిటీతో సినిమా తీశారు. ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ సినిమా అనుకున్న విధంగా తీయడానికి సహకరించారు. ప్రేమ, ఫ్రెండ్ షిప్ మధ్య నడుస్తుందీ  సినిమా. ఒక  ఫ్రెండ్ ప్రేమ కోసం మరో ఫ్రెండ్ ఎలాంటి రిస్క్ చేసాడు. ఆ ప్రేమికుల  జంటను ఎలా కలిపాడు అన్నది ఇంట్రస్టింగ్ పాయింట్. డిసెంబర్ 6న సినిమా వస్తుంది’’ అన్నారు. 

నటుడు అమిత్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇందులో మెయిన్ విలన్ గా నటిస్తున్నా’’ అన్నారు. 

హీరోయిన్ శైలజ మాట్లాడుతూ... ‘‘డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ చాలా  బాగా డిజైన్ చేసారు. పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర . డిసెంబర్ 6 న సినిమా వస్తుంది. అందరూ చూసి బ్లెస్ చేయండి’’ అన్నారు. 

పాశం యాదగిరి మాట్లాడుతూ... ‘‘టీజర్ బావుంది. సినిమా కూడా బావుంటుందని నమ్ముతున్నా. నిర్మాత తొలిసారి చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలి’’ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో పాశం యాదగిరి, ధర్మాసనం, సుధీర్ పాల్గొన్నారు.  

కాశీవిశ్వనాధ్, బెనర్జీ, అమిత్, వీరారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ : చిన్న, ఎడిటర్ : నందమూరి హరి, కెమెరా: సుధీర్, నిర్మాత: పి. వీరారెడ్డి, డైరెక్టర్: జి.మురళి. 

MERA DOSTH Movie Teaser Launched:

MERA DOSTH Movie Teaser Release Event details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs