Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ మ్యాజిక్ చేసేస్తున్నాడుగా..!


ప్రస్తుతం కాలంలో సినిమాలకు ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టాం అన్నది ముఖ్యం కాదు... ఆ సినిమాకి పబ్లిసిటీ ఏ రేంజ్ ఉంది అని మాట్లాడుకునే స్థాయికి వచ్చేసారు. బాలీవుడ్ లో అయితే సినిమాకి పెట్టిన బడ్జెట్ లో సగం ప్రమోషన్స్ కి పెడతారు కాబట్టి.. యావరేజ్ టాకొచ్చినా.. భీభత్సమైన కలెక్షన్స్ వస్తాయి. కానీ సౌత్ లో సినిమా తీశామా.. విడుదల చేశామా.. అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ప్రమోషన్స్ పై స్టార్ హీరోస్ అసలు పెద్దగా శ్రద్దే పెట్టరు. మహేష్ లాంటి హీరో అయితే ఒక ఇంటర్వ్యూ ఇస్తేనే గొప్ప అనుకుంటాడు. ఇక అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ ఇలా ఎవరికీ వారే తమ సినిమా ప్రమోషన్స్ అప్పుడు చాలా లైట్ గా ఉంటారు. అయితే మారుతున్న పరిస్థితులను బట్టి మనము మారాలనే ఐడియాలజితో అల్లు అర్జున్ ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో ఓ కొత్త ట్రెండ్ కి తెరలేపాడు.

Advertisement
CJ Advs

ఆ ఐడియాలలో మొదటిగా అల్లు అర్జున్ తన అల వైకుంఠపురములో సినిమాకి అప్లై చేసాడు. అందుకే సినిమా మొదలైంది మొదలు... అందరి దృష్టి అల వైకుంఠపురములో మీద ఉండేలా ప్లాన్ చేసాడు. అల్లు అర్జున్ చెప్పడంతోనే థమన్ అండ్ త్రివిక్రమ్ లు అల వైకుంఠపురములో సాంగ్స్ ని విడతలవారీగా వదులుతూ అందరి అటెన్షన్ ని తమ వైపు లాగేసారు. పారిస్‌కి పాటల కోసం వెళితే అక్కడ ఏ లొకేషన్‌లో షూట్‌ చేస్తే... దానివలన ఎక్కువ ప్రచారం లభిస్తుందనేది స్టడీ చేసి మరీ అక్కడ ఆ పాటలు చిత్రీకరించేలా అల్లు అర్జున్ కేర్‌ తీసుకున్నాడట. ప్రస్తుతం సాంగ్స్ విషయంలోనే దుమ్మురేపిన అల్లు అర్జున్, టీజర్, ట్రైలర్ విషయాల్లో ఎలాంటి కొత్తదనం చూపించబోతున్నాడో అంటూ అప్పుడే అందరూ హాట్ హాట్ చర్చలకు తెర లేపారు.

మరోపక్క సుకుమార్ సినిమా మొదలైందో లేదో... తాను సుకుమార్ తో చేసిన ఆర్య సినిమా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని భలేగా వాడేసాడు. తన ఫోటో సుక్కు ఫోటో జతచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అందరూ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేసాడు. మరి ఇలాంటి చిన్న చిన్న ఐడీయాలతోనే అల్లు అర్జున్ ప్రమోషన్స్ పరంగా దూసుకుపోతున్నాడు. మరి అల్లు అర్జున్ ని ఎంతమంది హీరోలు ఫాలో అవుతారో చూడాలి. 

Allu Arjun Praises Sukumar:

Allu Arjun Magic workouts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs