నాగబాబుది - జబర్దస్త్ ది విడదీయరాని బంధం. ఎనిమిదేళ్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా జబర్దస్త్ షో సాగడం అంటే మాటలు కాదు. ఇప్పటివరకు ఇలాంటి షోస్ ఇన్ని ఏళ్ళు సక్సెస్ ఫుల్ గా రన్ అయిన సందర్భం తెలుగులో లేదు. అలాంటి కామెడీ షోకి ఇప్పుడు జబర్దస్త్ కి కష్టాలు చుట్టుముట్టాయి. కారణం జబర్దస్త్ ని అన్నివిధాలా ముందుండి నడిపిస్తున్న నాగబాబు వెళ్లిపోవడం జబర్దస్త్ కి కోలుకోలేని దెబ్బె. హా కామెడీ జేడ్జ్ గా ఆ సీటులో నాగబాబు లేకపోతే జబర్దస్త్ షో నడవదా అంటే చెప్పలేం కానీ... నాగబాబు లోటు మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం రోజా ఒక్కదానితో.. ఎవరో ఓ సెలెబ్రిటీతో జబర్దస్త్ షో లాగించేస్తున్నప్పటికీ.. మున్ముందు ఎవరో ఒక సెటిల్ జేడ్జ్ కావాల్సిందే.
అయితే ఎవరో ఓ కామెడీ సెలెబ్రిటీని తీసుకుందామనుకున్నప్పటికీ.. ప్రస్తుతం జబర్దస్త్ కి దీర్ఘకాలం జేడ్జ్ గా ఉండేదుకు సుముఖత చూపడం లేదని వినికిడి. కారణం మల్లెమాల కండిషన్స్ అంటున్నారు. నాగబాబు - రోజా రాజకీయ ప్రత్యర్ధులైనప్పటికీ.. షో విషయంలో ఎక్కడా రాజీ పడకుండా జేడ్జ్ లుగా నవ్వుతూ నవ్వించారు. ఇక నాగబాబు కమెడియన్స్, టీం లీడర్స్ తో ఉన్న అనుబంధంతో... వారిని చాలా వరకు కంట్రోల్ చేస్తూ... మంచి స్కిట్స్ వచ్చేలా చూసాడు. అంతేకాకుండా జబర్దస్త్ ఒక్కో ఎపిసోడ్ ఒకరోజు పూర్తిగా పడుతుండడంతో.... ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేసుకుంటున్న సెలెబ్రిటీ కమెడియన్స్ కి అలా ఓ రోజంతా ఉండడం కుదరకపోవడంతో.. మల్లెమాల ఎక్కువ పారితోషకం ఆఫర్ చేసినా.. ఎవరూ ముందుకు రావడం లేదని టాక్.