Advertisement
Google Ads BL

‘అసురన్’ రీమేక్..: వెంకీ సరసన ఈ భామేనా!


తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘అసురన్’. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఇప్పటికే కలెక్షన్ల పరంగా రూ.100 కోట్లు దాటేసింది కూడా. ఈ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. దీంతో తెలుగు, బాలీవుడ్‌తో పాటు మరికొన్ని రీమేక్‌ హక్కుల కోసం క్యూ కట్టి ఎట్టకేలకు సాధించుకున్నారు. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఆ తర్వాత మళ్లీ రీమేక్‌ అవసరమా అని వెనకడుగేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాను తెరకెక్కించేది శ్రీకాంత్ అడ్డాల అని సురేష్ బాబు, వెంకీ ఇద్దరూ ఫిక్సయ్యారు. అయితే ఇక అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలుంది.

Advertisement
CJ Advs

ఇక మిగిలిందల్లా వెంకీ సరసన నటించేది ఎవరన్నది మాత్రమే. హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టిన దర్శకనిర్మాతలు ఫైనల్‌గా.. తన అందచందాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన శ్రియను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వెంకీ-శ్రియ కాంబో ఇదివరకే ‘సుభాష్ చంద్రబోస్’, ‘గోపాల గోపాల’ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ రెండు చిత్రాలు కూడా ఆశించినదానికంటే హిట్టయ్యాయి. అందుకే కొత్తవారిని తీసుకోవడమెందుకు..? శ్రియా అయితే సరిపోద్దిగా అని దర్శకనిర్మాతలు ఫిక్సయ్యారట. మరోవైపు.. వెంకీ కూడా శ్రీయకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం సినిమాలోకి విలన్‌గా ఎవర్ని తీసుకోవాలి..? ఆర్టిస్టులు ఎవరు..? ఎక్కడెక్కడ సెట్స్ వేయాలి..? ఇలాంటి అన్ని పనులు శ్రీకాంతే దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే సినిమాకు సంబంధించి అన్ని విషయాలను అధికారికంగా ప్రకటించి.. సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకనిర్మాతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా.. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన వివి. వినాయక్ హీరోగా మారుతున్న విషయం విదితమే. ఈ చిత్రానికి ‘సీనయ్య’ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో సీనయ్య సరసన శ్రియ నటిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇప్పుడేమో ‘అసురన్’ ఈ భామ నటిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది నిజమో..? ఏది అబద్ధమో. అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Senior Actress to star in Telugu remake of Dhanush’s Asuran:

Senior Actress to star in Telugu remake of Dhanush’s Asuran  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs