Advertisement
Google Ads BL

‘పింక్’ కాదు.. పవన్‌ ఈ కథకు ఫిక్సయ్యారట


‘ఇక సినిమాలొద్దు.. రాజకీయాలే ముద్దు.. ప్రజాసేవ చేసుకుంటా.. ’ అంటూ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అబ్బే అదేం లేదు.. అని ఓ వైపు పవర్ స్టార్ మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు..చెబుతున్నప్పటికీ ఇందులో నమ్మశక్యం లేదు. దీంతో అసలు సినిమా ఉందా..? లేదా..? ఎందుకీ నాన్చుడు అని పవన్ సొంత అభిమానులే సోషల్ మీడియా వేదికగా ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. మరోవైపు అధికార పార్టీ నేతలు సైతం ధ్వజమెత్తడం.. ఇవన్నీ అటుంచితే పవన్‌తో రీమేక్ మూవీ ‘పింక్’ చేస్తున్నట్లు నిర్మాతలు సైతం ప్రకటించడం ఇవన్నీ జరిగిపోయాయి. దీంతో మరోసారి మీడియా ముందుకొచ్చి తనను అడగకుండా ఎలా అధికారికంగా ప్రకటిస్తారంటూ ఆగ్రహించారు.

Advertisement
CJ Advs

ఆ తర్వాత కాస్త శాంతించిన పవన్.. చివరికి పింక్ కాదు.. ఇదిగో ఫలానా కథ కావాలంటూ ఓ ప్రముఖ దర్శకుడికి, నిర్మాతకు క్లారిటీగా చెప్పేశారట. రాజకీయ నేపథ్యమున్న స్టోరీనే కావాలని తేల్చేశాడట. అది కూడా.. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజాకీయాల పరిణామాల నేపథ్యంలోనే ఉండాలని.. తాను ఇప్పుడెలా అధికార పార్టీపై పోరాటం చేస్తున్నానో అలానే చూపించాలని.. చివరికి అధికార పార్టీని ఢీ కొట్టి సీఎం పీఠం అధిరోహించే వరకు కథ ఉండాలని చెప్పాడట. అంటే రీల్ లైఫ్‌లో ఫైనల్‌గా పవన్‌ను సీఎం సీటులో కూర్చోబెట్టాలన్న మాట. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ అయితే ఎన్నికలకు ముందు పొలిటికల్ బ్యాగ్రౌండ్‌లోనే మరోటి తెరకెక్కించొచ్చని పవన్ భావిస్తున్నారట.

అయితే.. సినిమా తీస్తే ఇది ప్లస్ అవుతుందా..? లేకుంటే అనవసరంగా మనకు మనమే అట్టర్ ప్లాప్ చేసుకున్నట్లు ఉంటుందా..? సొంత అభిమానుల నుంచే వ్యతిరేకత వస్తే పరిస్థితేంటి..? అని కూడా ఒకటికి పది సార్లు పవన్ ఆలోచించారట. ఇది ఎంత మాత్రం నిజమో తెలియదు కానీ.. వెబ్‌సైట్లు మాత్రం దీనిపై పుంకాలు పుంకాలుగా కథనాలు రాసేస్తున్నాయ్. మరోవైపు నెటిజన్లు, పవన్ అంటే గిట్టని వాళ్లు మాత్రం రియల్ లైఫ్‌లో రెండు చోట్ల పోటీచేసి ఒక్కచోట కూడా గెలవలేని పవన్.. రీల్‌ లైఫ్‌లో ముఖ్యమంత్రా.. అని నవ్వుకుంటూ.. తమదైన శైలిలో ఎమోజీలు పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ అభిమానులు మాత్రం.. ఇప్పుడు రీల్.. రేపొద్దున రియల్ ఇదే జరిగి తీరుద్ది అని చెప్పుకుంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సినిమా ఉంటుందా..? లేదా..? ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే కాస్త క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

Janasena Chief Fixed These Type Of Movie.. Details Here..!:

Janasena Chief Fixed These Type Of Movie.. Details Here..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs