Advertisement
Google Ads BL

పవన్‌పై ఆర్జీవీ సినిమా..‘మట్టి ముంతలో మజ్జిగన్నం’!


‘అంతా ఇష్టం.. నేను తీసిందే సినిమా.. మీకు నచ్చితే లేకుంటే సైలెంట్‌గా చూడండి.. నేనింతే’ అంటూ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి ఇంతకుమించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఆర్జీవీ సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి థియేటర్లలోకి వచ్చి ఆడేంత వరకూ ప్రతిరోజూ వివాదాలే వివాదాలుంటాయ్.. ఎందుకంటే ఆ వివాదాలే సినిమా ప్రమోషన్స్ గనుక. ఇక అసలు విషయానికొస్తే ఆర్జీవీ తాజాగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్‌తో చిత్రం ఎల్లుండి థియేటర్లలోకి రానుంది. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమోషన్స్ పీక్స్‌లోకి తీసుకొచ్చిన ఆర్జీవీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌గానీ.. ఇలాంటివేమీ లేకుండానే డైరెక్టుగా సోలో ప్రెస్‌మీట్ పెట్టేసి చిత్రం గురించి నాలుగు మాటలు మాట్లాడేశాడు. అయితే ఈ క్రమంలో తన తదుపురి చిత్రాలను సైతం పరోక్షంగా ప్రకటించాడు.

Advertisement
CJ Advs

వాస్తవానికి ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’.. సినిమా రిలీజ్ అవుతుందో అనేది ఇప్పటికీ తెలియని విషయం. మరోవైపు ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’  సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ తీస్తానని రాత్రి చెప్పి.. తెల్లారేసరికి అబ్బే అదేం లేదు అని ప్రకటించాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కి తగ్గాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో నిజానిజాలెంత అనేది మాత్రం తెలియరాలేదు. ఆర్జీవీ మాత్రం ఎవరికి బయపడడన్న విషయం తెలిసిందే.

ఇక అసలు విషయానికొస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినిమా తీస్తున్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అది కూడా.. ‘మట్టి ముంతలో మజ్జిగన్నం’ అనే టైటిల్‌తో సినిమా తీస్తున్నట్టు పరోక్షంగా ప్రకటించాడు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని మీడియా ప్రశ్నించగా ఆయన మాత్రం నోరుమెదపలేదు. చివరగా.. అవునా ఆ విషయం నాకేం తెలియదే అంటూనే.. ఆ సినిమా తీస్తే కచ్చితంగా మీడియాకు అంకితమిస్తానని చెప్పాడు. అంటే అర్థమేంటి.. సినిమా తీస్తున్నట్లా లేదా అనేది ఆర్జీవీకే తెలియాలి. మెగా ఫ్యామిలీ అంటే ఆర్జీవీ అస్సలు పడదు.. మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరినీ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిట్టిపోసిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాదు.. చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా..ఆర్జీవీ విమర్శలకు అంతే రీతిలో మెగాభిమానుల నుంచి కూడా రియాక్షన్స్ వచ్చాయ్. మరి తాజాగా పరోక్షంగా చేసిన ప్రకటనపై మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

RGV’s Next Cinema On Pawan Kalyan? :

RGV’s Next Cinema On Pawan Kalyan?   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs