Advertisement
Google Ads BL

‘90 ML’ తాగుబోతుల సినిమా కాదంట!


ఇది తాగుబోతుల సినిమా కాదు: ‘90 ML’ డైరెక్టర్ శేఖర్ రెడ్డి

Advertisement
CJ Advs

‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం తీసిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ ‘90 ఎం.ఎల్‌’ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్బంగా దర్శకుడు శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

సినిమా గురించి చెప్పండి?

అందరూ సినిమా టైటిల్ చూడగానే తాగుబోతుల సినిమా అనుకుంటున్నారు. లిక్కర్ కి సంబందించిన బ్యాక్ గ్రౌండ్ లో సినిమా ఉండవచ్చు గాని పూర్తిగా తాగుబోతు సినిమా అయితే కాదు. మందు తాగమని ఎంకరేజ్ చేసే సినిమా అసలే కాదు. మద్యానికి బానిసైన ఒక క్యారెక్టర్ ని బేస్ చేసుకొన్న కల్పిత కథ. సినిమా చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసే పనిలో ఉన్నాం. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నా. 

ఇంతకుముందు ఎవరి దగ్గర వర్క్ చేశారు? 

డైరెక్టర్ చంద్ర మహేష్ దగ్గర సహాయ దర్శకుడిగా కొన్నాళ్లపాటు వర్క్ చేశాను. కొన్ని సినిమాలకు కో రైటర్ గా కూడా పని చేశాను. నేను నల్గొండకి చెందినవాన్ని. చిన్నప్పుడే హైదరాబాద్ కి వచ్చాము. నా విద్యాబ్యాసం ఇక్కడే జరిగింది. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ తో నాకు ముందే పరిచయం ఉంది. ఆయన ద్వారా కార్తికేయని కలిసి స్టోరీ చెప్పడం జరిగింది. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.  

సినిమాలో స్పెషల్ కంటెంట్ ఏముంది?

జనాలకు కథ పాయింట్ అర్ధంమవ్వాలనే విధంగా ముందుగా క్యారెక్టర్ ని ఎలివేట్ చేశాం. మొదటి పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు అన్ని అంశాలు జనాలకు నచ్చే విధంగా జాగ్రత్తపడ్డాం. సినిమాలో రవి కిషన్ పాత్రను రివీల్ చేయలేదు. ఆ పాత్ర కొంచెం సైకో షేడ్స్ లో ఉంటుంది. అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఆ పాత్ర అందరికి నచ్చుతుంది. 

కథ ఆలోచన ఎలా వచ్చింది? 

యూ ట్యూబ్ వీడియోస్ లో చాలా ఉన్నాయి. చిన్న పిల్ల దగ్గరికి బాటిల్ తీసుకెళ్ళన్నప్పుడు అట్రాక్టివ్ అవుతుంటారు. చిన్న పిల్లలు మందు బాటిల్స్ దగ్గరకు వెళుతూ ఉంటారు. ఒకవేళ పాల సీసా ఇవ్వాల్సిన తల్లి మద్యం సీసా ఇవ్వాల్సి వస్తే? అతని పరిస్థితి ఏంటి? ఆ తరువాత ఎలాంటి పరిస్థితులకు అది దారి తీస్తుంది అనే ఆలోచనతోనే ఈ కథ తట్టింది. ఇలాంటి పాయింట్ ఇంతవరకు తెరపై రాలేదు. ఎవరిని నొప్పించకుండా కల్పిత కథగా సినిమాని తెరకెక్కించాం. 

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది?

 ఏ కథ అయినా సరే మార్నింగ్ షో పడగానే టాక్ ను బట్టి ఆడియెన్స్ కి రీచ్ అవుతుంది. అందరికి నచ్చేలా సినిమా చేయడం అన్నిసార్లు కుదరదు. సినిమా నచ్చితేనే ఎవరైనా సరే వచ్చి చూస్తారు. కొన్నిసార్లు యూత్ కి నచ్చేలా సినిమాలు ఉంటాయి. మరికొన్నిసార్లు ఫ్యామిలీకి నచ్చేలా ఉంటాయి. అందరికి నచ్చేలా సినిమా చేయడమంటే కష్టం. 

మందు సన్నివేశాలు కేవలం హీరో పాత్రవరకే ఉంటాయి. ఎక్కడా కూడా ఎవరిని మందు తాగమని ప్రోత్సహించే సన్నివేశాలు ఉండవు. కేవలం సినిమాలో ఆ పాత్ర మందు తాగకపోతే బ్రతకలేడు అనే కాన్సెప్ట్ తో నడుస్తుంది. ప్రేమ్ నగర్ సినిమాలో డాక్టర్ చెప్పిన సలహా కూడా అలాంటిదే..  మందు తాగితేనే బ్రతుకుతారు అనేధీ అందులో పాయింట్. చాలా దేశాల్లో మద్యం బ్యాన్ చేసినప్పటికీ లిక్కర్ తాగితేనే బ్రతుకరు అనే వాళ్ళు ఉన్నారు. వారికోసం స్పెషల్ గా ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇచ్చి మందు తాగేందుకు అనుమతులు ఇస్తారు. 

తమిళ్ లో ఒక సినిమా ఇదే టైటిల్ తో వచ్చింది.. దానికి ఈ సినిమాకు ఏదేమైనా సంబంధం ఉందా? 

90ML అనే టైటిల్ మేము ముందే రిజిస్ట్రేట్ చేసుకున్నాం. ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అదొక అయిదుగురి అమ్మాయిల కథ. ఇది హీరో చుట్టూ తిరిగే కథ. కంప్లీట్ డిఫరెంట్ మూవీ. మీరెప్పుడు చూడని కొత్త తరహా కాన్సెప్ట్ ని ఈ సినిమాలో చూస్తారు. 

కార్తికేయ గురించి.. ...

సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కథానాయకుడు కరెక్ట్ గా సెట్టయ్యాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. కథ వినగానే పెద్దగా మార్పులు చేయమని అడగలేదు. ఆర్ఎక్స్ 100 సినిమా ప్రభావం ఈ సినిమాలో చూపించలేదు. నేను కథ చెప్పగానే వెంటనే ఒప్పుకొని కథ చాలా బావుందని అన్నారు. కొత్తగా వచ్చే దర్శకులకు ఎవరో ఒకరు అవకాశం ఇస్తేనే వారి టాలెంట్ నిరూపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నాకు నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టారు. అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

90 ML Movie Director SEKHAR REDDY interview:

Director SEKHAR REDDY Talks about 90 ML Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs