Advertisement
Google Ads BL

‘ఉదయ్ కిరణ్’ బయోపిక్‌.. సందీప్ కిషన్ క్లారిటీ


టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిరణ్.. కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆత్మహత్యకు కారణం ఎవరు..? ఎందుకు ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు..? అనేవి ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం. ‘మనసంతా నువ్వే’, ‘నువ్వు నేను’, ‘శ్రీరామ్’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్ తర్వాత ప్లాప్స్ బారిన పడి.. జీవితాన్ని అర్దాంతరంగా ముగించుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్న టైమ్‌లో టాలీవుడ్ షాక్ తిన్నది. అయితే హీరోగా ఉవ్వెత్తున ఎగిసి పడిన ఉదయ్ కిరణ్ జీవిత చరిత్రని సినిమాగా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఉదయ్ జీవితంలో నెలకొన్న ఆటు పోట్లు.. సినీ కెరీర్‌ను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారని గత వారం రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. అయితే ఈ బయోపిక్‌లో ఉదయ్ పాత్రలో యంగ్ హీరో సందీప్ కిషన్ చేయబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయ్.. సూపర్బ్.. సందీప్ అయితే కరెక్టుగా సెట్ అవుతాడని అందరూ సోషల్ మీడియా వేదికగా కితాబిచ్చారు కూడా. మరోవైపు.. ఉదయ్ కిరణ్ మీద జరిగిన కాంట్రవర్సీ ప్రచారాలను కూడా ఆ యువ దర్శకుడు ఈ సినిమాలో చూపిస్తాడా? అసలు సందీప్ కిషన్, ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో నటించడానికి అంత ధైర్యం చేశాడా? ఉదయ్ రియల్ జీవితంలో జరిగిన నిజాల్ని భయటపెడతాడా? అంటూ అప్పుడే రకరకాల అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అవన్నీ అటుంచితే.. బయోపిక్‌లో సందీప్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు.

అబ్బే నేను.. బయోపిక్‌లోనా..!?

‘ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో నేను నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. అసలు నాకు బయోపిక్‌ సినిమాల్లో నటించాలనే ఆసక్తి కూడా లేదు. గత కొన్ని రోజులుగా ఈ బయోపిక్‌లో నేను నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఆ బయోపిక్‌లో నటించమని ఇప్పటి వరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు’ అని సందీప్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఒకవేళ బయోపిక్‌‌లో నటించమని సంప్రదించినా తాను నటించనని చెప్పేశాడు. సో.. మొత్తానికి చూస్తే పుకార్లకు సందీప్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మరి బయోపిక్‌ వస్తుందో రాదో..? వస్తే ఇందులో నటించేదెవరో..? దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే.

Sundeep Kishan Gives Clarity OVer Uday Kiran Biopic:

Sundeep Kishan Gives Clarity OVer Uday Kiran Biopic  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs