మాస్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్‌గా పేరుగాంచిన దర్శకుడు వివి వినాయక్.. వీర మాస్ లెవల్‌లో ఓ భగీరథ ప్రయత్నం చేస్తున్నట్లు గత రెండ్రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ సినిమాలను తెరకెక్కించిన ఆయన.. తాజాగా హీరోగా వస్తున్నారు. ఈ రెండు పక్కనెడితే పెద్ద బిజినెస్ ప్లానే చేశాడు ‘సీనయ్య’. ఓ పెద్ద స్టూడియోను నిర్మించాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయ్. ఒక్క స్టూడియోనే కాదు.. ఓ భారీ రెస్టారెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అనుమతులు యిపోయాయని టాక్ నడుస్తోంది.
రాజకీయ నాయకుడు కావాల్సిన వినాయక్.. దర్శకుడిగా మారాడు. అయితే రాజకీయాల్లోకి రాలేదు కానీ.. రాజకీయ నేతలతో మాత్రం బాగా పరిచయాలున్నాయ్.. అందుకే ఇటు సినిమాలను.. అటు రాజకీయాలను బాగానే మేనేజ్ చేస్తూ వస్తున్నాడు వినాయక్. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో వినాయక్‌కు మంచి సన్నిహిత సంబంధం ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే మంత్రి కేటీఆర్‌తోనూ టచ్‌లో ఆయన ఉంటున్నాడట. ఇలా ఈ ఇద్దరి మాట సాయంతో హైదరాబాద్ సరిహద్దుల్లోని చేవెళ్ల ప్రాంతంలో 20 ఎకరాలకు పైగా భూమి కొన్నాడని సమాచారం.
ఇందులోనే స్టూడియోతో పాటు భారీ రిసార్ట్‌కు ఇప్పటికే స్కెచ్ కూడా పూర్తి చేసుకుని.. ప్రభుత్వం దగ్గర అనుమతులు కూడా తీసుకున్నాడట. అంటే వర్కవుట్ అయితే స్టూడియోలో సినిమాలు చేయడం.. లేకుంటే హైదరాబాద్‌లో పెద్ద పెద్ద కుటుంబాలు సేదతీరేందుకు అనువుగా ఉండే రిసార్ట్‌తో లాభాలు పొందొచ్చని వినాయక్ మల్టీ ప్లాన్ చేశాడన్న మాట. అన్నీ అనుకున్నట్లు జరిగితే సీనయ్య సినిమా పూర్తవ్వగానే పనులు ప్రారంభించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమిపూజ అటు సీఎం జగన్.. ఇటు మంత్రి కేటీఆర్ ఇద్దర్నీ ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నాడట. గత రెండ్రోజులుగా అటు టాలీవుడ్‌లో ఇటు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఈ విషఫయం హాట్ టాపిక్ అవుతోంది.. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే వినాయక్ రియాక్ట్ అవ్వాల్సిందే మరి.