విజయ్ సేతుపతి హీరోగానే కాదు... ఇప్పుడు విలనవతారము ఎత్తాడు. హీరోగా మంచి క్రేజున్న విజయ్ సేతుపతి విలన్ గా మారితే ఆ క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. అందుకే ఆ క్రేజ్ ని విజయ్ సేతుపతి క్యాష్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. తెలుగులోనూ విజయ్ సేతుపతికున్న ఫాలోయింగ్ తో మైత్రి మూవీస్ వారు మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన కోసం విలన్ రోల్ కి తీసుకున్నారు. మెగా హీరో సినిమా అయినా.. డెబ్యూ హీరో కావడంతో... సినిమాపై క్రేజ్ కోసం విజయ్ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోని విలన్ గా తీసుకోవడం, అలాగే సినిమాకి భారీ క్రేజ్ రావడం జరిగింది.
మరి విజయ్ లాంటి వాడు విలన్ అంటే భారీగా ఇచ్చుకోవాల్సిందే. అందుకే ఈ సినిమా కోసం విజయ్ సేతుపతితో మైత్రివారు 2.5 కోట్లకు ఒప్పందం చేసుకున్నారట. అయితే ఈమధ్యన ఉప్పెన బడ్జెట్ పరిధి దాటిపోతుంది అంటూ వార్తలొస్తున్నాయి. ఉప్పెనకి బడ్జెట్ పరిధి దాటడానికి విజయ్ సేతుపతి ఓ కారణమట. తన 40 రోజుల కాల్షీట్స్ కోసం 2.5 కోట్ల ఒప్పందం చేసుకున్న విజయ్ సేతుపతి... మధ్యలో తన కాల్షీట్స్ వేస్ట్ అవడం, తర్వాత మళ్ళీ తన డేట్స్ కావాలని అడగడంతో... ప్రస్తుతం తానున్న బిజీ కారణంగా తన డేట్స్ కి మరో కోటిన్నర ఎక్కువ అడుగుతున్నాడట విజయ్.
విజయ్ పాత్ర సినిమాకి కీలకం, అలాగే విజయ్ సేతుపతి సినిమాలో దాదాపుగా 40 నిముషాలు కనిపిస్తాడని, అతడితో తియ్యాల్సిన సన్నివేశాలు ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో... విజయ్ అడిగింది ఇవ్వడానికి మైత్రి వారు సిద్దమవుతున్నారట. మరి తగిలించుకున్నాక తప్పదు కదా అన్న చందంగా విజయ్ సేతుపతి డిమాండ్స్ ని తీరుస్తున్నారట. కాకపోతే విజయ్ సేతుపతిని తట్టుకోవడం కష్టమంటూ సన్నిహితుల వద్ద ఉప్పెన నిర్మాతలు వాపోతున్నారట.