Advertisement
Google Ads BL

టాలీవుడ్‌లో ‘దర్బార్’ ఆటలు సాగడంలా?


రజినీకాంత్ అంటే ఓ బ్రాండ్, ఆయనంటే ఓ క్రేజ్. అందుకే రజిని సినిమాలు ప్లాప్ అయినా ఆయన తరువాతి సినిమాలకు భీభత్సమైన క్రేజ్. కానీ ఆ క్రేజ్ ఏ రెండు మూడు సినిమాలు ప్లాప్ అయితేనే పనిచేస్తుంది కానీ వరసబెట్టి రజిని సినిమాలన్నీ లెక్కకుమించి ప్లాప్ అవుతుంటే... ఎలా ఉంటుంది. అయితే తమిళనాట రజిని మ్యానియా బాగానే పనిచేసినా... తెలుగులో రజినీకాంత్ సినిమాలకు గడ్డుకాలం ఏర్పడింది. రోబో తర్వాత హిట్ లేని రజినీకాంత్ సినిమా కొనాలంటే తెలుగు బయ్యర్లు భయపడుతున్నారు. ఎంతగా మురుగదాస్ డైరెక్టర్ అన్నప్పటికీ.... రజినీకాంత్ దర్బార్ సినిమాపై తెలుగులో క్రేజ్ రావడం లేదు. మురుగదాస్ ని ముందు పెట్టి సినిమాని తెలుగు నిర్మాతలకు అంటగడదామన్న.. మురుగదాస్ స్పైడర్  దెబ్బనుండి ఇంకా బయ్యర్లు కోలుకోలేదు.

Advertisement
CJ Advs

అందుకే దర్బార్ ని కొనడానికి బయ్యర్లేవరు సాహసం చెయ్యడం లేదు. అందులోను సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలతో గట్టి పోటీ ఉండడం, ఆ సినిమాలకన్నా ఎంతగా ముందు వచ్చిన... రెండు రోజులకే రజిని మీద అంత డబ్బు పెట్టాలంటే కష్టమంటున్నారు. 2.ఓ. కబాలి, కాలా, పేట సినిమాల డిజాస్టర్స్ తో రజిని సినిమాలను కొనాలంటే బయ్యర్లు బెంబేలెత్తుతున్నారు. బన్నీ, మహేష్ సినిమాలకన్నా ముందు అంటే జనవరి 9 న విడుదలై పాజిటివ్ టాక్ పడినా... తర్వాత మూడు రోజులకి మహేష్, బన్నీల హవా మొదలై రజిని దర్బార్ సోదిలోకి లేకుండా పోతుందని భయపడుతున్నారు. అందుకే దర్బార్ కి కనీస రేటు రాక తెలుగు మార్కెట్ అలానే ఉందని.. ఒకవేళ అనుకున్న రేటు రాకపోతే తమిళ నిర్మాతలే తెలుగులోనూ డైరెక్ట్ గా విడుదలచేసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. 

Darbar Business not closed in Tollywood:

Business problems to Darbar Movie In Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs