కృష్ణవంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యాంకర్ అనసూయ!


యాంకర్ అనసూయ.. ఇప్పుడు బిజీబిజీగా గడుపుతోంది. ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై వరుస అవకాశాలతో అసలు ఏది వదులుకోవాలో.. దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో కూడా ఈ హాట్ పాపకు దిక్కుతోచట్లేదట. వెండితెరపై ‘రంగమ్మత్త’ ఓ వెలుగు వెలిగిన ఈమెకు నాటి నుంచి నేటి వరకూ అవకాశాలకు కొదవలేదు. అంతేకాదు.. ఈమె లేడీ ఓరియెంటెడ్ పాత్రలో సైతం నటించి మెప్పించింది. ఇవన్నీ ఓ ఎత్తయితే ఈ ముద్దుగుమ్మ కోసమే కొన్ని కొన్ని పాత్రలు డైరెక్టర్లు రాస్తున్నారంటే రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈ హాట్ అనుకు బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 

ఆణిముత్యాల్లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌ని అల‌రించిన కృష్ణవంశీ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో మిగతా డైరెక్టర్లతో పోలిస్తే ఈయన రూటే సపరేటు. కాగా.. ఈయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ పైకి వెళ్లింది. విశాఖ‌పట్నంలో చిత్ర షూటింగ్ జరుపుకుంటోంది. ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్‌ వచ్చింది.

అదేమిటంటే.. ‘రంగమార్తాండ’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో అనసూయ తళుక్కున మెరవనుందని సమాచారం. ఫలానా పాత్రలో మీరు చేయాలని అనసూయను చిత్రబృందం సంప్రదించగా.. ఏ మాత్రం ఆలోచించకుండానే ‘నేను రెడీ.. సార్’ అని కృష్ణవంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టాలీవుడ్ నగర్ టాక్. అయితే అనసూయ పాత్రేంటి..? ఈ హాట్ బ్యూటీని ఆయన ఎలా చూపించబోతున్నారు..? ముఖ్యమైన పాత్ర అని వార్తలు వస్తుండటంతో యాంకరమ్మ మరో బంపరాఫర్ కొట్టేసిందిగా అని తోటి ఆర్టిస్టులు, యాంకర్లు ఒకింత అసూయపడుతున్నారట. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచిచూడాల్సిందే.

Hot Anchor Anasuya Green Signal To Krishna vamsi!:

Hot Anchor Anasuya Green Signal To Krishna vamsi!  
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES