Advertisement
Google Ads BL

సరిలేరు రిలీజ్‌కు ముందే మహేశ్‌కు భారీ కటౌట్


టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ చిత్రానికి సంబంధించిన చిన్నపాటి లుక్స్.. ఇటీవల టీజర్ తప్ప.. సింగిల్ సాంగ్.. ట్రైలర్ గానీ రిలీజ్ చేయలేదు. దీంతో ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని మహేశ్ వీరాభిమానులు, ఘట్టమనేని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. సరిలేరుతో పాటు సంక్రాంతికి రిలీజ్ అయ్యే ‘అల వైకుంఠపురంలో..’ ప్రమోషన్స్ పరంగా దూసుకెళ్తుండటంతో ఒకింత మహేశ్ అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. అయితే.. సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేస్తుందో లేదో అనుకున్నారేమో గానీ.. ఇదిగో పక్కనుండే కటౌట్‌ వైపు ఓ లుక్కేయండి. అభిమానులే ఇలా భారీ కటౌట్‌లతో వారి హీరోను ప్రమోట్ చేసేసుకుంటున్నారు. అంటే దీన్ని ఫ్యాన్స్ ప్రమోషన్ అని చెప్పుకోవచ్చన్న మాట.

Advertisement
CJ Advs

అసలు ఈ భారీ కటౌట్ ఎక్కడ ఏర్పాటు చేశారు..? ఇందులో నిజమెంత..? నిజంగానే ఏర్పాటు చేశారా..? ఫొటో షాప్‌లో చేసి హడావుడి చేస్తున్నారా..? అనే విషయాలపై కాస్త లోతుగా వెళ్లి తెలుసుకోగా విషయాలన్నీ తెలియవచ్చాయి. హైదరాబాద్‌లోని పేరుగాంచిన సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ మహేష్ బాబు అడ్డా అనే విషయం తెలిసిందే. దీంతో సూపర్ స్టార్ 81 అడుగుల కటౌట్‌ని థియేటర్‌ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఆ యాజమాన్యానికి మహేశ్ అంటే అంత అభిమానం మరి. ప్రస్తుతం ఈ కటౌట్ వ్యవహారం టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశమే అవుతోంది. అదేదో సామెత ఉంది కదా.. ‘ఆలు లేదు.. సూలు లేదు....’ అన్నట్లుగా.. ఇంకా పాటలు కూడా రిలీజ్ కాలేదు.. సరిగ్గా ప్రమోషన్స్ కూడా షురూ చేయలేదు.. జరగాల్సినవి మాత్రం అన్నీ జరిగిపోతున్నాయ్. అయితే టీజర్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడంతో ఇక మహేశ్‌కు తిరుగులేదని అటు ఫ్యాన్స్ నెట్టింట్లో పెద్ద ఎత్తునే హడావుడి చేస్తున్నారు. దీంతో ఇప్పట్నుంచే సదరు థియేటర్ యాజమాన్యం.. తాము అభిమానించే హీరో కటౌట్ సుదర్శన్‌లో ఏర్పాటు చేసుకుంది. రిలీజ్‌కు నెలన్నర ముందే ఇలా ఉంటే.. మున్ముంథు పరిస్థితి ఎలా ఉంటుంటో మహేశ్ ఫ్యాన్స్‌కే తెలియాలి మరి.

Fans build a huge royal 81 Ft cutout for Mahesh Babu :

Fans build a huge royal 81 Ft cutout for Mahesh Babu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs