Advertisement
Google Ads BL

శ్రీముఖి వర్సెస్ రవి మధ్యలో ‘నాన్న’.. అసలేమైంది!


యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3కి ఈ ముద్దుగుమ్మ వెళ్లొచ్చిన తర్వాత శ్రీముఖి.. శ్రీముఖి అంటూ ఎక్కడ చూసినా పేరు మార్మోగుతోంది. అయితే ఆ షో కాస్త అయిపోయింది.. శ్రీముఖీ బయటికొచ్చేసింది. వాట్ నెక్స్ట్.. ఇంతకీ మళ్లీ ‘పటాస్’తో మళ్లీ ఈ భామ మెరుస్తుందా..? లేదా రేంజ్ పెరిగింది కదా వాటన్నింటినీ లైట్ తీసుకొని పెద్ద పెద్ద షోలకు వెళ్లి లకరాలు పెంచేస్తుందా..? అనేదానిపై పెద్ద ఎత్తునే సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే సాగింది. అయితే అనుకున్నట్లుగానే పటాస్ పక్కనెట్టేసి ‘మా’ టీవీలో ఈ మధ్యే ‘మ్యూజిక్ లీలోడెడ్’ జస్ట్ వెయిట్ అంటూ ఓ ప్రోమోలో మెరిసింది. 

Advertisement
CJ Advs

దీంతో అసలేం జరుగుతోంది..? పాత షోల సంగతేంటి..? నిజంగానే పటాస్‌ను శ్రీముఖి పక్కనెట్టేసిందా..? లేకుంటే రవితో ఏమైనా గొడవలు జరిగాయా..? అనేది మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. అయితే.. కాస్త బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళితే.. అప్పట్లో తనను ఒకరు పెళ్లి వరకు వచ్చిన తర్వాత దారుణంగా మోసం చేశారని శ్రీముఖి చెప్పడం.. ఆ క్రమంలోనే రవి హౌస్‌లోకి వెళ్లినప్పటికీ ఎడమొహం.. పెడమొహంగా ఉండటంతో అందరిలోనూ అనుమానాలు చెలరేగాయి. శ్రీముఖిని మోసం చేసిందెవరు..? రవి ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు..? అనేదానిపై చర్చనీయాంశమైంది. ఇక ఆ విషయాలన్నీ పక్కనెడితే ఇక పటాస్ పరిస్థితేంటి..? శ్రీముఖి రీ ఎంట్రీ గురించి మరోసారి చర్చకు రాగా.. ‘నాన్న’ రంగంలోకి దింపింది.!. అదెలాగో మీరూ ఓ లుక్కేయండి.

‘నేను రవితో కలిసి యాంకరింగ్ చేయాలా వద్దా అనేది నా నిర్ణయం కాదు.. ఇకపై మా నాన్న ఎలా చెబితే అలా చేస్తాను. మా నాన్న షోకు వెళ్లమంటే వెళ్తాను.. లేకుంటే లేదు. మా నాన్న పర్మిషన్ కావాలి’ అని చెప్పుకొచ్చిందీ భామ. అయితే ఇదేంటి.. ఇన్ని రోజులు వాళ్ల నాన్న చెబితేనే చేసిందా ఏంటి..? అసలు ఏం జరుగుతోంది..? ఇన్ని రోజులుగా లేని పర్మిషన్.. బిగ్‌బాస్‌కు వెల్లొచ్చిన తర్వాత మళ్లీ ఎందుకు పర్మిషన్లు, అసలేంటి కథ..? కొంపదీసి రవితో మళ్లీ యవ్వారం చెడిందా ఏంటి..? లవ్ గురించి చెప్పినప్పట్నుంచి ఇంతవరకూ ఈ భామ ఎందుకు రవి ప్రస్తావన తేలేదు ఎందుకనీ..? ఇన్ని రోజులే రవి.. శ్రీముఖి బాగానే ఉన్నారు కదా.. మధ్యలో ‘నాన్న’ ఎందుకు వచ్చాడు..? అసలేం జరుగుతోంది.. మాకు తెలియాలి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. మరి శ్రీముఖి కాస్త రియాక్ట్ అయ్యి వీటన్నింటికీ సమాధానం చెబితే బాగుంటుందేమో మరి.

What Happened.. Sreemukhi VS Ravi!:

What Happened.. Sreemukhi VS Ravi!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs