Advertisement
Google Ads BL

‘వెంకీమామ’లో వెంకీ పాత్ర లీకైపోయిందోచ్!


ఈ ఏడాది F2 మూవీతో తో అదిరిపోయే హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ ఇప్పుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీమామ’గా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు అయిపోగా.. మరోవైపు సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ సైతం చిత్రబృందం షురూ చేసింది. అయితే వెంకటేష్.. పాయల్ రాజపుత్‌తో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు. కాగా ఈ బ్యూటీతో వెంకీ ఫస్ట్ టైమ్ రొమాన్స్ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించి చాలా వరకు అప్డేట్స్ వచ్చాయ్ కానీ.. సినిమా ఎలా ఉంటుంది..? అసలు పాత్ర ఎలా ఉంటుంది..? వెంకీ పాత్ర ఎలా ఉండబోతోంది..? చైతూ పాత్రేంటి..? అనేది మాత్రం ఇప్పటికీ చిత్రబృందం చాలా గోప్యంగా ఉంచింది. 

Advertisement
CJ Advs

మరోవైపు F2 లో ఫుల్ కామెడీ, ఫ్రస్టేషన్‌తో ఊగిపోయిన వెంకీ.. వెంకీమామలో మాత్రం గుండెలు పిండేసే ఎమోషన్స్‌తో అదరగొడతాడని ఆ మధ్య టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. చాలా రోజుల తర్వాత వెంకటేష్ ఎమోషనల్‌గా ప్రేక్షకులకు కంటతడి పెట్టిస్తాడని సమాచారం. వెంకటేష్ - నాగ చైతన్య మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయని అప్పటి సమాచారం. అయితే తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. వెంకీ పాత్ర లీకవ్వడమే ఆ ఆప్డేట్ సారాంశం. వెంకీ పాత్ర లీకైపోయిందోచ్ అంటూ అటు నెట్టింట్లో.. ఇటు వెబ్ సైట్లలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

వెంకీ పాత్ర చాలా సరదాగా సాగిపోతుందట. తెరపై వెంకటేశ్ చేసే సందడి ఒక రేంజ్‌లో ఉంటుందని.. మధ్య వయస్కుడిగా ఈ సినిమాలో కనిపించే ఆయన పాయల్ పరిచయమైన దగ్గర నుంచి ఆయన ధోరణి పూర్తిగా మారిపోతుందని తాజాగా వార్తలు వస్తున్నాయ్. అంతేకాదండోయ్.. ఎప్పుడైతే పాయల్ పాప పరిచయం అవుతుందో అప్పట్నుంచి వెంకీలో చాలా మార్పు ఉంటుందట. అప్పట్నుంచి ఎప్పుడూ లేని విధంగా గ్లామర్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టడం, ఆమె ఆలోచనల్లో వెంకీ మునిగిపోతాడట. వెంకీ సిగ్గుపడేటప్పుడు వచ్చే సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయట. సో.. మొత్తానికి చూస్తే.. సినిమా మొత్తమ్మీద వెంకీ పాత్ర కామెడీగా సరదాగా సాగిపోతుందన్న మాట. మరి ఇది ఎంతవరకు నిజమో.. ఏంటో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందేనట.

Venky Role leaked In ‘VenkyMama’ Movie!:

Venky Role leaked In ‘VenkyMama’ Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs