Advertisement
Google Ads BL

జి. నాగేశ్వరరెడ్డి కొత్త చిత్రం మొదలైంది


జి. నాగేశ్వరరెడ్డి దర్వకత్వంలో శ్రీ కార్తికేయ సినిమాస్, ఎస్.కె. పిక్చర్స్ చిత్రం ప్రారంభం

Advertisement
CJ Advs

విశాల్ హీరోగా ఇటీవల ‘యాక్షన్’ చిత్రాన్ని అందించిన శ్రీ కార్తికేయ సినిమాస్ ఎస్.కె. పిక్చర్స్ తో కలిసి ఓ చిత్రనిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే ‘తెనాలి రామకృష్ణ’ చిత్రాన్ని రూపొందించిన జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ ప్రముఖ హీరోతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. ఫిలింనగర్ లోని దైవసన్నిధానంలో  సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఆడెపు శ్రీనివాస్, సురేష్ కొండేటి, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను వివరించారు.

నిర్మాతల్లో ఒకరైన ఆడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ... ఎగ్జిబ్యూటర్ గా ఉన్న తను పంపిణీదారుడిగా మారి ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, రాజుగారి గది 3 తదితర చిత్రాలను అందించానన్నారు. విశాల్ హీరోగా ‘యాక్షన్’ చిత్రంతో నిర్మాతగా మారానన్నారు. ప్రేక్షకులకు  నచ్చే చిత్రాలను నిర్మించాలన్న లక్ష్యంతో ఈ రంగంలో అడుగుపెట్టానన్నారు. దర్శకుడిగా తనకు నాగేశ్వరరెడ్డి సినిమాలంటే చాలా ఇష్టమని, వినోదమే ప్రధానంగా ఆయన సినిమాలు ఉంటాయని, అదే కోవలో ఈ సినిమా కూడా తెరకెక్కబోతోందన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందన్నారు.

మరో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ... ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన తమ సంస్థ శ్రీ కార్తికేయ సినిమాస్ తో కలిసి ఈ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆడెపు శ్రీనివాస్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత అని,

అందుకే ఆయనతో కలసి ముందుకు వెళుతున్నామన్నారు. పంపిణీ దారుడిగా ఇటీవల ఆయన అందించిన చిత్రాలన్నీ మంచి విజయాలను నమోదు చేశాయని వివరించారు. తమ ఇద్దరి కలయికలో వచ్చే ఈ చిత్రం మరిన్ని విజయవంతమైన చిత్రాలకు నాంది పలుకుతుందని భావిస్తున్నానన్నారు.

దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ఇటీవల వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ కంటే  పూర్తి ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందన్నారు. నిర్మాత శ్రీనివాస్ మంచి స్నేహశీలి అని, ఆయన సక్సెస్ ఫుల్ పంపిణీదారుడిగా మాత్రమే

ఇప్పటివరకు తనకు తెలుసని, మంచి విజయవంతమైన నిర్మాతగా కూడా ఆయనను చూడబోతున్నామన్నారు. ఈ నిర్మాతలిద్దరి కలయికలో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత సురేష్ కొండేటితో తనకు ఉన్న స్నేహం ఇప్పటిది కాదని, తమ ఇద్దరి మధ్య మంచి ఆత్మీయతానుబంధం ఉందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

G Nageswara Reddy New Movie in Sri Karthikeya Cinemas and SK Pictures:

Director G Nageswara Reddy New Movie Launched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs