Advertisement
Google Ads BL

క్రేజ్ తెచ్చుకోవడానికి.. ఇలాగేనా చెప్పేది!


మంచు విష్ణు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని హీరో. అయినా సినిమాల్లో హీరోగా విష్ణు ఎప్పటిప్పుడు అదృష్టం పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ఢీ, దేనికైనా రెడీ ఇలా ఒకటి రెండు సినిమాలు తప్ప విష్ణు కెరీర్‌లో ఒక్కటీ చెప్పుకోదగ్గ చిత్రం లేదు. అయితే ఓటర్ సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకుని కాస్త కొత్తగా మేకోవర్ అయిన మంచు విష్ణు ‘మోసగాళ్లు’ అనే ద్విభాష చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓటర్ సినిమాకి ముందే జీరో మార్కెట్‌కి పడిపోయిన మంచు విష్ణు సినిమాలు వదిలేస్తున్నాడనుకున్నారు. అయితే మధ్యలో సిక్స్ ప్యాక్ బాడీ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంచు విష్ణు.. తాజాగా ‘మోసగాళ్లు’ అంటూ ఫస్ట్ లుక్ వదిలేసరికి అతడొక సినిమా చేస్తున్నాడని అందరికీ తెలిసింది.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాతో అటు హాలీవుడ్‌లోను, ఇటు తెలుగులో హిట్ కొట్టేయాలని తెగ ఉవ్విళ్లూరుతున్న మంచి విష్ణు ఇప్పుడు తమ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్రిమియ‌ర్‌గా ప్ర‌ద‌ర్శించేందుకు చూస్తున్నాడనే న్యూస్ చూసి అంతా గుసగుసలాడుకుంటున్నారు. మంచు విష్ణు ఏమిటి కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో తన సినిమాని ప్రీమియర్ వెయ్యడమేమిటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి మంచు విష్ణు మాత్రం మా సినిమా మీద మాకు నమ్మకం ఉందని అందుకే ఆ ఏర్పాట్లు అని చెబుతున్నాడు. మరి మార్కెట్ జీరో అయినప్పుడు.. ఎన్ని ఎత్తులేసి.... సినిమా మీద క్రేజ్ సంపాదించినా వేస్టే. అది మంచు విష్ణుకి అర్ధం కావడం లేదు. ఇక ఈ మోసగాళ్లు సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా... నవదీప్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 

Manchu Vishnu Talks About Mosagaallu:

Mosagaallu Movie Premiere in Canes Film Festival
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs