Advertisement
Google Ads BL

‘సరిలేరు..’ సెట్స్‌లో దర్శకుడి బర్త్‌డే హంగామా


సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు సెట్స్ లో అనిల్ రావిపూడి బర్త్ డే సెలెబ్రేషన్స్  

Advertisement
CJ Advs

‘పటాస్’ తో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించి ఆ తరువాత వరుసగా ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘F2’ వంటి భారీ హిట్స్ తో దూసుకెళ్తోన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సారి సూపర్ స్టార్ మహేష్ తో సంక్రాంతికి మరోసారి బ్లాక్ బస్టర్ సాధించేందుకు ‘సరిలేరు నీకెవ్వరు’ సిద్ధం చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. నవంబర్ 22 న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఒక్క రోజులోనే 18 మిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించి సంచలనం సృష్టించింది.  

నవంబర్ 23 న ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ జరుగుతున్న అంగమలై ఫారెస్ట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. సూపర్ స్టార్ మహేష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ శిరీష్ తో పాటూ యూనిట్ సభ్యులందరూ  అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ... ‘‘అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తనతో వర్క్ చేయడం అన్ని విధాలుగా ఒక ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. తాను మరింత సంతోషంగా ఉండాలని మరెన్నో బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని కోరుకుంటున్నాను.’’ అన్నారు.

అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ కి థాంక్స్ చెప్తూ... ‘‘మీ విషెస్ కి చాలా థాంక్స్ సార్. మీతో వర్క్ చేయడం నాకు మెమొరబుల్ జర్నీ. మీతో పని చేస్తూ ఎన్నో నేర్చుకున్నాను. ఇది ఎప్పటికీ మర్చిపోలేను.’’ అన్నారు. ఈ పుట్టినరోజు ఎప్పటికీ మర్చిపోలేనని, ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ కి తమ అంచనాలని మించి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని అన్నారు. ఈ స్థాయి రెస్పాన్స్ రావడానికి ముఖ్య కారణమైన సూపర్ స్టార్ మహేష్ గారికి, నా టీంకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

Anil Ravipudi Birthday Celebrations at Sarileru Neekevvaru Sets:

Sarileru Neekevvaru Team Celebrates Director Anil Ravipudi Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs