Advertisement
Google Ads BL

నాగబాబు వద్దంటే.. రోజా రమ్మంటుంది


నాగబాబు ఆఫీషియల్ గా జబర్దస్త్ నుండి బయటికొచ్చేసాడు. నిన్న శుక్రవారంతో నాగబాబు జబర్దస్త్ నవ్వుల జర్నీకి ఫుల్ స్టాప్ పడింది. నాగబాబు జబర్దస్త్ వీడడం, జీ తెలుగులో ప్రసారం కాబోతున్న కామెడీ షోస్ కి ప్రిపేర్ అవడం జరిగిపోయింది. అయితే నాగబాబు వెళ్ళిన తర్వాత ఆ జడ్జ్ ప్లేస్ ని ఎవరు భర్తీ చేస్తారో ఇంకా క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం నాగబాబు, మరో జడ్జ్ రోజా మధ్యన జబర్దస్త్ కమెడియన్స్ నలిగిపోతున్నారనే టాక్ మొదలైంది. నాగబాబుతో పాటుగా చమ్మక్ చంద్ర లాంటి టాప్ కమెడియన్స్ వెళ్లిపోగా.. సుడిగాలి సుదీర్, అదిరే అభి, హైపర్ ఆది లాంటి వాళ్ళు ఇంకా జబర్దస్త్ లోనే ఉన్నారు. అయితే నాగబాబు జబర్దస్త్ ప్రొడ్యూసర్స్ మీదున్న కోపంతో... జబర్దస్త్ కమెడియన్స్ ని తన వైపు తిప్పుకుందామని ప్రయతించినా సుడిగాలి సుధీర్, రష్మీ లాంటి వాళ్ళు సైలెంట్ గా జబర్దస్త్ లోనే ఉండడంతో... నాగబాబు జబర్దస్త్ కమెడియన్స్ ని పిలిచి తన ఇంట్లోనే పర్సనల్ గా వారికి పార్టీ ఇచ్చి మరీ.. జబర్దస్త్ నుండి తనతో పాటు బయటికి రమ్మని చెప్పాడట.

Advertisement
CJ Advs

చెప్పడమే కాదు.. వారికి చిన్నసైజు హెచ్చరిక కూడా జారీ చేసాడని ఫిలింనగర్ టాక్. అయితే ఈలోపు రోజా కూడా జబర్దస్త్ కమెడియన్స్ ని పిలిచి జబర్దస్త్ మీకు అన్నం పెట్టింది. అన్నం పెట్టిన సంస్థకే సున్నం పెడతారా అంటూ వారిని కన్విన్సు చెయ్యడానికి చూస్తుందట. మరి ఇటు నాగబాబుతో పెట్టుకుంటే ఏమవుతుందో... అటు రోజా మాట వినకపోతే తమ జబర్దస్త్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అంటూ కమెడియన్స్ అంతా తలలు పట్టుకున్నారట. మరి వచ్చే వారం గాని జబర్దస్త్ లో ఎవరు ఉన్నారు, ఎవరు నాగబాబు హెచ్చరికలకు భయపడ్డారా అనేది తెలియదు. 

No Twist in Jabardasth:

Jabardasth fight between Roja and Nagababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs