Advertisement
Google Ads BL

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ విడుదల తేదీ ఫిక్స్


ఈ నెల 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల 

Advertisement
CJ Advs

రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని ఈ  నెల 29న  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ... 800 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నామని తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు, విశేషమైన ఆదరణ లభించిందని తెలిపింది. అలాగే పప్పు లాంటి అబ్బాయి పాట కూడా అశేష ప్రేక్షక వాహిని ఆదరణతో ట్రెండింగ్ అయ్యిందని  చిత్రబృందం వెల్లడించింది. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదని... ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్ప్రష్టం చేసింది. ఇందులోని  ఏడు పాటలు ఏ పాటకు ఆ పాట హైలెట్ గా ఉంటుందని వివరించింది. టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. న‌రేష్‌కుమార్‌, టి. శ్రీ‌ధర్. 

Kamma Rajyamlo Kadapa Reddlu Release Date fixed:

Kamma Rajyamlo Kadapa Reddlu Release on Nov 29
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs