Advertisement
Google Ads BL

‘ఉప్పెన’ సినిమాలో హైలెట్ అదేనా?


మెగా కాంపౌండ్ నుండి వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్. విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ లో అడుగుపెట్టడంతో .. ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు పుట్టేసాయి. అలాగే విజయ్ సేతుపతి ఈ పాత్ర ఎంత గొప్పగా లేకపోతే ఒప్పుకున్నాడు. ఆ పాత్ర కోసం విజయ్ సేతుపతి 6 కోట్ల రెమ్యూనరేషన్‌ అందుకున్నాడా అనే ప్రచారానికి సినిమాపై క్రేజ్ పెరిగిపోతుంది. అయితే సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఉప్పెన సినిమాపై ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది.

Advertisement
CJ Advs

అదేమిటంటే ఉప్పెన సినిమాకి క్లైమాక్స్ కీలకం కానుందని, క్లైమాక్స్ సినిమాకే హైలెట్ అంటున్నారు. అసలు బుచ్చిబాబు చెప్పిన క్లైమాక్స్ కి సుకుమార్ షాకయ్యాడంటే ఆ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటి కలుగుతుంది. బుచ్చిబాబు ఉప్పెన క్లైమాక్స్ ని తెలుగు సినిమా ప‌రిమితుల్ని, ప‌రిధుల్నీ దాటుకుని వెళ్లి మ‌రింత ‘రా’గా తీశాడ‌ని సమాచారం. ప్రేమ స‌న్నివేశాలు స‌రికొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ని, క్లైమాక్స్‌లో అయితే.. ఓ షాక్ త‌గ‌ల‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఓ ర‌కంగా ఇది యాంటీ క్లైమాక్స్‌ అంటున్నారు. అందుకే ఈ సినిమాకి క్లైమాక్స్‌ కీలకం కానుందని చెబుతున్నారు. మరి యాంటీ క్లైమాక్స్ అంటే హీరోని చంపేస్తాడో.. లేదంటే హీరోయిన్ పాత్రకి ముగింపు పలుకుతాడో అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో బయలుదేరింది. 

This is the Highlight for Uppena Movie:

Uppena Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs