Advertisement
Google Ads BL

‘జైలవకుశ’కు కనెక్ట్ అయిన ‘ఫైటర్’


ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలో ‘జై’ పాత్రలో నత్తినత్తిగా మాట్లాడి.. పవర్ ఫుల్ నటనతో అదరగొట్టేసాడు. పాత్ర పవర్ ఫుల్ అయినా... మాటలో తడబాటుతో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. అయితే అప్పట్లో పూరి జగన్నాధ్ ఓ కథ ఎన్టీఆర్ కి చెప్పగా ఆ కథలో హీరో పాత్రకి నత్తి ఉంటే.. కథ నచ్చకపోయినా.. హీరో పాత్ర కి ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యాడట. అయితే ఆ కథ మరుగున పడిపోవడం, ఎన్టీఆర్ జై లవకుశ లో నత్తి పాత్ర చెయ్యగా.. అప్పట్లో పూరి ఆ సినిమా చూసి షాకయినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఎన్టీఆర్ కి చెప్పిన కథనే చాలామంది హీరోలతో చెయ్యాలనుకుంటే.. ఎవరూ పూరికి అవకాశం ఇవ్వలేదు కానీ.. విజయ్ దేవరకొండ మాత్రం పూరి చెప్పిన స్టోరీ లైన్‌కి ఇంప్రెస్స్ అయ్యి ఆ కథకి కనెక్ట్ అవ్వడంతో.. పూరి - విజయ్ కాంబో పట్టాలెక్కింది.

Advertisement
CJ Advs

అయితే ఫైటర్ గా విజయ్ దేవరకొండ పాత్ర పవర్ ఫుల్ గా ఉండడమే కాదు... సిక్స్ ప్యాక్ లుక్ లో నత్తినత్తిగా ఉండబోతుందని అంటున్నారు. మరి పూరి మార్క్ మాస్ ఎలెమెంట్స్ ఈ పాత్రకి పుష్కలంగా ఉండడంతో.. విజయ్ దేవరకొండ ఆ నత్తి పాత్రని ఒప్పుకున్నాడని అంటున్నారు. మరి ఎన్టీఆర్ అదరగొట్టిన నత్తి పాత్రని విజయ్ ఎలా హ్యాండిల్ చెయ్యబోతున్నాడో అనే క్యూరియాసిటీ విజయ్ అభిమానుల్లో ఏర్పడింది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఓ కీ రోల్ పోషించబోతుందని, అది కూడా విజయ్ దేవరకొండకి దిశానిర్దేశం చేసే కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందని.. ఆమె చెప్పే సూచనల్తోనే హీరో పాత్రధారి తన రూటు మార్చుకుని, మార్షల్ ఆర్ట్స్‌లో ఎదుగుతాడని.. కథ మొత్తం విజయ్, రమ్యకృష్ణల మీదే ఉండబోతుందని అంటున్నారు. 

Fighter Connection to Young Tiger Jai Lavakusa:

Fighter Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs