Advertisement
Google Ads BL

వినాయక్ రిలీజ్ చేసిన ‘శివ 143’ ట్రైలర్‌


భీమవరం టాకీస్ శివ 143 ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్

Advertisement
CJ Advs

శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు‌గా భీమవరం టాకీస్ బ్యానర్‌లో రామసత్యనారాయణ నిర్మించిన 98వ చిత్రం ‘శివ 143’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా జరిగింది. 

ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ.. ‘‘రామ సత్యనారాయణ నాకు చిరకాల మిత్రుడు. చిన్న సినిమాల నిర్మాణంలో అందెవేసిన చెయ్యి. చిన్న సినిమా ఎలా తీయాలో, తీసిన సినిమాను ప్రేక్షకులలోకి ఎలా తీసుకువెళ్లాలో బాగా తెలిసినవాడు. దర్శకుడు సాగర్ శైలేష్ హీరో‌గా, దర్శకుడుగా, కొరియోగ్రాఫర్‌గా బాగా చేసాడు. ట్రైలర్ బాగుంది. DS రావు విలన్ పాత్రలో బాగా సూటయ్యాడు. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా వస్తుంది..’’ అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘నేను ఏ పని చేసినా డైరెక్టర్ వినాయక్‌గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన గతంలో మా రహస్యం సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఆ సినిమా విజయం సాధించింది. ఇప్పడు శివ 143 సినిమా ట్రైలర్ ఆయన చేతుల మీదుగా విడుదల అవ్వడం సంతోషం. డైరెక్టర్, హీరో శైలేష్ ఈ సినిమాను అందంగా తెరకెక్కించారు. గతంలో మా భీమవరం టాకీస్ బ్యానర్‌లో వచ్చిన రహస్యం తరహాలోనే ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. శైలేష్ హీరోగా, దర్శకుడుగా నేను నిర్మించిన రహస్యం సినిమా సక్సెస్ అవ్వడంతో మళ్లీ శైలేష్ నేను కలసి శివ 143 సినిమాను తీశాము..’’ అన్నారు. 

హీరో, డైరెక్టర్ శైలేష్ మాట్లాడుతూ.. ‘‘రామసత్యనారాయణగారు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు. మా చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ వినాయక్‌గారు (సీనయ్య) విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. సగం విజయం పొందినట్టే ఉంది. ట్రైలర్‌పై మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సంక్రాంతి కానుకగా మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరికి నచ్చే విధంగా మా సినిమా ఉండబోతోంది..’’ అని తెలిపారు.

చిత్రం: శివ 143 (ది జర్నీ ఆఫ్ టూ హార్స్)

నటీనటులు: సాగర్ శైలేష్, ఎఇషా, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి తదితరులు

నిర్మాత: రామసత్యనారాయణ 

మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి

ఎడిటర్: శివ వై ప్రసాద్

కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి

ట్రైలర్ కట్ అండ్ సిజీ: నరేన్

పీఆర్ఓ: మధు వి.ఆర్

కథ, స్క్రీన్‌ప్లే, స్టంట్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్

VV Vinayak Releases Siva 143 Movie Trailer:

Siva 143 Movie Trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs