Advertisement
Google Ads BL

కొత్త ట్రెండ్: ‘సూసైడ్ క్లబ్’ ట్రయిల్ షో


3 i ఫిలిమ్స్ సమర్పణలో  మజిలీ సినిమా ఫేమ్  శివ రామాచద్రవరపు లీడ్ రోల్ లో  ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం ‘సూసైడ్ క్లబ్’. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3 i ఫిలిమ్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబందించిన  అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఈ సినిమాపై ఉన్న అపారమైన నమ్మకంతో ట్రయిల్ షోను నిర్వహించారు చిత్ర బృందం. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

Advertisement
CJ Advs

ఈ కార్యక్రమంలో మొదటగా డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... నేను రియల్ లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్ ను ఇంప్లిమెంట్ చేసి సినిమాటిక్ గా చేసిన చిత్రమే ‘సూసైడ్ క్లబ్’. కంప్లీట్ గా స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ. శివ పర్ఫెక్ట్ గా సరిపోయాడు.  ఇక వెంకట్ ప్లే చేసిన రోల్ అయితే యూనిక్ గా ఉంటుంది. మా చిత్ర యూనిట్ లో ఉన్న 80 మందిలో చందన ఒక్కటే అమ్మాయి. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఇరగదీసాడు అని చెప్పాలి. ఎడిటర్ శర్వా ఎడిటింగ్ స్కిల్స్ సూపర్ అనిపిస్తాయి. త్వరలో మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

హీరో శివ మాట్లాడుతూ... తెలుగు,  హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కించడం జరిగింది. అందులో కూడా ఓన్ గా డబ్బింగ్ చెప్పడం జరిగింది. డే అండ్ నైట్ షూట్ చేసాడు డైరెక్టర్. పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ. ఒకసారి స్టోరీ వినగానే చేద్దాం అని చెప్పేశాను. అంత నచ్చింది నాకు ఈ చిత్రం. కొత్త వారి కొత్త ప్రయోగం చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. 

వెంకట్ మాట్లాడుతూ... నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా... టీమ్ అందరూ కష్టపడి చేసిన చిత్రం ఇది అన్నారు.

శివ రామాచద్రవరపు, ప్రవీణ్ యండమూరి, చందన, సందీప్ రెడ్డి, వెంకట కృష్ణ, సాకేత్ సింగ్ నటించిన ఈ చిత్రానికి రైటర్ మరియు డైరెక్టర్: శ్రీనివాస్ బొగడపాటి, ప్రొడ్యూసర్: 3 i ఫిలిమ్స్ అండ్ ప్రవీణ్ ప్రభు వెంకటేశం, మ్యూజిక్: కున్ని గుడిపాటి, ఎడిటర్: డే సెల్వ, ఆర్ట్: శాన్ నవార్, విజువల్స్: పవన్ కుమార్ తడక, కుమార్ నిర్మల సృజన్, పి.ఆర్.ఓ: బి.వీరబాబు, సౌండ్: రాఘవ చరణ్.

Suicide Club Premiere for Media:

Suicide Club Movie Latest update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs