‘నిశ్శబ్దం’ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్ ‘మైకేల్ మ్యాడ్‌సన్’ లుక్
అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, షాలిని పాండే ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతోన్న క్రాస్ ఓవర్ చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో హాలీవుడ్‌కి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, ఫొటోగ్రాఫర్ మైకేల్ మ్యాడ్‌సన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. అంతర్జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న ఈ హాలీవుడ్ నటుడు ‘నిశ్శబ్దం’ చిత్రంలో రిచర్డ్ డికెన్స్ అనే పోలీస్ హెడ్ పాత్రలో కనిపించనున్నారు. గురువారం ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించనుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనుష్క శెట్టి సహా పలువురు ఇండియన్స్ యాక్టర్స్, హాలీవుడ్ యాక్టర్ మైకేల్ మ్యాడ్‌సన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తుండగా షానియల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీరజ కోన, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంకట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్, స్టోరీ, డైరెక్షన్ - హేమంత్ మధుకర్.