జబర్దస్త్ టీంలో హైపర్ ఆది స్కిట్ కి, చమ్మక్ చంద్ర స్కిట్ కి ఉన్న ప్రేక్షకులు మరే స్కిట్స్ కి ఉండరనేది జగమెరిగిన సత్యం. చమ్మక్ చంద్ర కన్నా హైపర్ ఆది స్కిట్స్ కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆది పంచ్ డైలాగ్స్ కి అతనికి వెండితెర మీద కూడా భీభత్సమైన ఆఫర్స్ వస్తున్నాయి కూడా. అయితే ఇప్పుడు హైపర్ ఆది, నాగబాబు వలన కష్టాల్లో పడ్డాడు అనే టాక్ వినబడుతుంది. జబర్దస్త్ నుండి నాగబాబు వెళ్లిపోవడంతో.. నాగబాబుకు దగ్గరైన చంద్ర, ఆది లాంటి వాళ్ళు కూడా వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే చమ్మక్ చంద్ర, నాగబాబుతో బయటికి రాగా... ఇప్పుడు ఆది కూడా జబర్దస్త్ నుండి బయటికెళ్లడానికి రెడీ అయ్యాడనే న్యూస్ మల్లెమాల టీవీని షేక్ చేస్తుంది.
అయితే ఆదిని ఎట్టి పరిస్తితుల్లో బయటికి వెళ్లకుండా ఉండేందుకు మల్లెమాల టీం ప్లాన్ చేసిందనే న్యూస్ నడుస్తుంది. హైపర్ అది బయటికెళ్తే జబర్దస్త్ నడవడం కష్టమని భావించిన మల్లెమాల టీం.. ఆదిని నయానో భయానో జబర్దస్త్ లో ఉండేలా చూడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. కానీ ఆది మాత్రం పక్క ఛానల్ నుండి భారీ పారితోషకం ఆఫర్ రావడం, వెండితెర ఆవకాశాలు రావడంతో పక్క చూపులు చూడడంతో... అతన్ని ఆపడానికి గాను మల్లెమాల టివి వారు ఆది బయటికెళ్తే లీగల్ గా చర్యలు తీసుకుంటామని.. ఒప్పందం ప్రకారం సినిమాలు చెయ్యడానికి గాని, పక్కకి పోవడానికి గాని అధికారం లేదని.. చేస్తే జబర్దస్త్ చేయాలని మల్లెమాల టీం ఆదిపై బెదిరింపులకు దిగినట్లుగా టాక్. మరి మల్లెమాల టీం వాదనకు దిగడంతో.. ఆది కి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదని.. నాగబాబు వలన తానూ కష్టాల్లో ఇరుక్కున్నానంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.