Advertisement
Google Ads BL

వినూత్న తరహాలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్


సూపర్ స్టార్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్న ‘సరిలేరు నీకెవ్వరు’ వినూత్న తరహా టీజర్ కాన్సెప్ట్

Advertisement
CJ Advs

సూపర్‌స్టార్‌ మహేష్‌ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను 22న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నారు.

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేక అన్‌లాక్ ఫీచర్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్‌ను నవంబర్ 19న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికీ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా టీజర్ డేట్, టైమ్‌ను రీవీల్ చేయడానికి ట్విట్టర్‌లో అనుసరించిన కొత్త తరహా కాన్సెప్ట్ సూపర్ స్టార్ అభిమానులను థ్రిల్ చేసింది. ఈ తరహా నూతన ప్రయత్నంతో టీజర్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ సోషల్ మీడియా సర్కిల్‌‌లో ట్రెండింగ్‌లో ఉంది. ప్రమోషన్స్‌లో మొట్ట మొదటిసారి చేసిన ఈ తరహా ప్రయోగంతో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ తమ ప్రమోషన్స్‌ని ఘనంగా ప్రారంభించింది.

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉండడంతో ఇదే జోష్, ఎనర్జీతో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషనల్ టీమ్ రాబోయే వారాల్లో, చిత్రం విడుదలకు ముందే మరెన్నో వినూత్న ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. అందరూ ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ నవంబర్ 22న సాయంత్రం 5:04 కి విడుదల కానుంది. చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2020 సంక్రాంతికి విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Sarileru Neekevvaru Movie Promotions Started:

Sarileru Neekevvaru Movie Promotions in Different Way
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs