సినిమా స్టార్స్ యాడ్స్ చేస్తూ.. ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారంటే.. ఆ కంపెనీ ప్రొడక్ట్స్‌కి గిరాకీ పెరుగుతుంది. ఇంకా ఆ స్టార్‌కి బాగా గిట్టుబాటు అవుతుంది. అందుకే సినిమాల్లో క్రేజ్ ఉన్న స్టార్స్ ని తమ కంపెనీ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడంలో పలు కంపెనీలు పోటీ పడతాయి. స్టార్స్ చిన్నపనికి పెద్దమొత్తం వస్తుంటే ఎందుకు కాదంటారు. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తమ క్రేజ్ ని పలు యాడ్స్ కి ఉపయోగిస్తున్నారు. కానీ ఓ క్రేజీ తార మాత్రం ఓ గిరి గీసుకుని ఆ బరిలో కూర్చుంది. తన పాలసీకి యాడ్స్ వ్యతిరేకమని, గ్లామర్ షో చెయ్యనని, లిప్ లాక్స్‌కి దూరమని చెబుతుంది.
ఆమె ఎవరో కాదు సాయి పల్లవే. ఆమె నటిస్తున్న సినిమాలు ప్లాప్ అయినా.. సాయి పాపకి బోలెడంత క్రేజ్. అందుకే సాయి పల్లవిని తమ ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని పలు కంపెనీలు వెంటపడినా.. సాయి పల్లవి మాత్రం టెంప్ట్ అవ్వలేదు. తాజాగా సాయి పల్లవి కోసం ఓ పెద్ద బట్టల దుకాణం వారు... భారీ పారితోషకం ఇస్తామని తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని... చిన్నపాటి యాడ్ చేస్తే సరిపోతుందని బ్రతిమాలినా సాయి పల్లవి మాత్రం తన రూల్స్ ని మీరనని సున్నితంగా చెప్పి పంపిందట. మరి సాయి పల్లవిని చూస్తే జాలేస్తుంది. హీరోయిన్స్ అంటే క్రేజ్ ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని విస్మరిస్తోంది.