Advertisement
Google Ads BL

ఈ హీరోల ఇళ్లపై కూడా ఐటీ దాడులు!


టాలీవుడ్‌‌‌‌‌ ప్రముఖలపై ఐటీ కన్నేసింది. ఇప్పటి వరకూ ఏకకాలంలో ప్రముఖల ఇళ్లపై ఈ రేంజ్‌లో ఐటీ అధికారులు దాడులు చేసిన దాఖలాల్లేవ్. బుధవారం ఫస్ట్ టైం.. పలు ప్రముఖ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లు, ప్రముఖ హీరోలు, నిర్మాతలకు ఐటీ అధికారులు ఊహించని షాకిచ్చారు. అయితే ఎవరెవరి ఇళ్లపై ఐటీ అధికారులు మెరుపుదాడులు చేశారనే విషయం పూర్తిగా తెలియరాలేదు కానీ.. ఇద్దరు హీరోల పేర్లు మాత్రం పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ ఐటీ దాడులతో టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

Advertisement
CJ Advs

ఆ ఇద్దరు మరెవరో కాదు.. ఒకరు దగ్గుబాటి వెంకటేష్ (విక్టరీ వెంకీ), నేచురల్ స్టార్ నాని. మొదట రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రముఖ హీరోల ఇళ్లపై దాడులు చేస్తున్నట్లు తెలియవచ్చింది. జూబ్లీహిల్స్ లోని నాని ఇళ్లు , ఆయనకు సంబంధించిన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో నాని ఒకరన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే నాని నిర్మాతగా మారారు. అంతేకాదు.. ఒక్కో సినిమాకు నాని గట్టిగానే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. విక్టరీ వెంకీకి సంబంధించిన ఇంటిపైనా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్పాలగూడలోని వెంకీ ఇంటిపై ఐదుగురు అధికారులతో కూడిన బృందంలో మెరుపు దాడులు చేస్తోందని సమాచారం. తెల్లవారు జాము నుంచే అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. మొదట రామానాయుడు స్టూడియో, సురేష్ బాబుకు చెందిన ప్రొడక్షన్స్‌ హౌస్‌పై దాడులు చేస్తూ.. ఇదే క్రమంలో విక్టరీ వెంకీ ఇంటిపైనా ఐటీ దాడులు చేస్తోంది. అయితే సోదాల్లో ఏమేం దొరికాయన్న విషయం మాత్రం తెలియరాలేదు.

రామానాయుడు స్టూడియోతో పాటు 7 అనుబంధ సంస్థల్లో ఆడిటర్ల సమక్షంలో సోదాలు జరుగుతున్నాయి. అయితే ఈ సోదాలకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి సమాచారం బయటికి రాలేదు.. పైగా సురేష్ బాబు, వెంకీ, నాని ఇప్పటి వరకూ ఎలాంటి క్లూ కూడా ఇవ్వట్లేదు. మరి ఈ వ్యవహారం బయటికి పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేకుంటే బయటపెడతారో వేచి చూడాల్సిందే మరి.

IT Raids on Tollywood Heroes:

IT Raids on Venkatesh and Nani houses 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs