చిరంజీవి - కొరటాల సినిమా అఫీషియల్ గా పట్టాలెక్కింది. ఇంకా రెగ్యులర్ షూట్ మొదలవ్వలేదు కానీ... ఈ సినిమా స్టార్ కాస్ట్ ని ఎంపిక చేసే పనిలో కొరటాల బాగా బిజీగా వున్నాడు. నటీనటుల దగ్గరనుండి టెక్నీకల్ టీం వరకు కొరటాల ఎంపికపై అందరిలో ఆసక్తి ఉంది. ఇకపోతే కొరటాల శివ తాను తీసిన సినిమాలన్నిటికీ దేవిశ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. వారిది హిట్ కాంబో కూడా. కానీ చిరంజీవి సినిమా కొచ్చేసరికి దేవిని దూరం పెట్టాడు కొరటాల. కారణాలు తెలియవు కానీ... కొరటాల సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేటలో ఉంది కొరటాల టీం. ముందుగా బాలీవుడ్ నుండి కొరటాల - చిరు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.
కానీ తాజాగా కొరటాల - చిరు సినిమాకి ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లో కొచ్చిన మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఫిలింనగర్ టాక్. గతంలో చిరుతో చాలా హిట్ సినిమాలు చేసిన మణిశర్మ.. కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయాడు. మణిశర్మ మ్యూజిక్ ని రొటీన్ అంటూ ఆయన్ని పక్కన పడేసారు. చిరుతో అన్నయ్య, ఇంద్ర లాంటి హిట్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మకి ఇస్మార్ట్ శంకర్ మళ్ళీ ఊపునివ్వడంతో... చిరు అండ్ కొరటాల ఇప్పుడు మణిశర్మ వైపు మొగ్గు చూపినట్టుగా టాక్. ఇక త్వరలోనే చిరు 152 మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ అంటూ అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అంటున్నారు. మరి ఇస్మార్ట్ తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనూ, సాంగ్స్ తోనూ టాప్ లేపిన మణిశర్మ చిరుకి ఎలాంటి హిట్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడో అంటూ మెగా అభిమానుల ఆత్రుత ఎక్కువైపోయింది.