జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్. పూర్తిస్థాయి హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జాక్‌పాట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కళ్యాణ్. జ్యోతికకు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. ఇది వరకు ఆమె ఇక్కడ చాలా సినిమాల్లో కూడా నటించారు. పెళ్లి తర్వాత కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఇప్పుడు మళ్లీ జాక్‌పాట్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో జ్యోతిక, రేవతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకోనున్నాయి. యోగి బాబు, ఆనంద్ రాజ్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్నారు. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ ఈ చిత్రాన్ని నవంబర్ 21న విడుదల చేస్తోంది. ఈ రోజు మీడియా సమావేశంలో ఆడియో ట్రైలర్‌ను ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేసి మీడియాతో చిత్ర యూనిట్ మాట్లాడారు.
ప్రొడ్యూసర్ రాజశేఖర్ మాట్లాడుతూ... జాక్‌పాట్ నాకు చాలా స్పెషల్ చిత్రం. ఈ చిత్రం ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని తీశాం. దర్శకుడు కళ్యాణ్ కథ న్యారేట్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అందుకే వెంటనే ప్రొడ్యూస్ చేశాను, జ్యోతిక చాలా బాగా చేసింది. కళ్యాణ్ ఇంత మంచి సబ్జెక్ట్‌ను నా దగ్గరకు తీసుకొచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాజ్ ఆనంద్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్‌లో నటించారు. జ్యోతిక, రేవతి ఇద్దరు చాలా బాగా చేశారు. బన్నీవాసు నా స్నుహితుడు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న గీతాఆర్ట్స్ బన్నీవాసుకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం. మీరందరూ ఈ చిత్రాన్ని చూసి తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
భారతిబాబు మాట్లాడుతూ... వర్మగారు నాకు ఈ చిత్రానికి డైలాగులు రాసే అవకాశాన్ని కల్పించారు. 20రోజుల్లో పని మొత్తం పూర్తిచేశాను. ఈ మధ్య కాలంలో ఇంత మంచి చిత్రం రాలేదు. తమిళ్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. రేవతిగారి ఫైట్స్ చాలా బావుంటాయి. కళ్యాణ్ గారు, రాత్రి పగలు కష్టపడి చేశారు. నాకు ఈ చిత్రంలో పనిచేసేందుకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజశేఖర్‌గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
ఆనంద్‌రాజా మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా నేను పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నా తమిళ్‌లో కూడా అప్పుడప్పుడు చిత్రాలు చేస్తున్నా. ఇప్పుడు ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సూర్య 2డి ఎంటర్‌టైన్మెంట్స్ తన సొంత బ్యానర్‌లో జ్యోతికగారు చాలా బాగా చేశారు. ఆవిడ ఇద్దరు పిల్లలున్నా కూడా ఎక్కడా ఆ విధంగా కనిపించలేదు. నాతో కలిసి నటించిన నా తోటి నటీనటులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మధ్య కాలంలో తమిళ్‌లో వచ్చిన చిత్రాలన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి. తమిళ్‌లోనే కాకుండా ఇక్కడ కూడా మంచి హిట్లు వస్తున్నాయి. గతంలో నేను కోడిరామకృష్ణ ఇంకా కొందరు దర్శకులతో పని చేశాను. అలాగే గీతా ఆర్ట్స్‌లో కూడా పని చేశాను. ఈ మూవీ చాలా మంచి హిట్ అవుతుంది. నా తరపున కళ్యాణ్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
దర్శకుడు కళ్యాణ్ మాట్లాడుతూ... ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇక్కడ కూడా తప్పకుండా హిట్ అవుతుంది. ఇందులో నటించిన నటీనటులందరూ చాలా బాగా చేశారు. మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న బన్నీవాసుగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.
నటీనటులు:
జ్యోతిక, రేవతి, యోగిబాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, జగన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: కళ్యాణ్
నిర్మాత: సూర్య శివకుమార్
సహ నిర్మాత: రాజశేఖర్ కరూపసుందర పాండియన్
సినిమాటోగ్రఫీ: ఆర్ఎస్ ఆనంద కుమార్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను