సైరా నరసింహారెడ్డి సినిమాతో పెద్ద డైరెక్టర్‌గా మారిన సురేందర్ రెడ్డి.. ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌తో అశోక్ సినిమా బలవంతంగా చేయించారని చెబుతూ సంచలనాలకు తెర లేపాడు. మరి ఎన్టీఆర్ కెరీర్‌లో సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన అశోక్ ఎంత పెద్ద డిజాస్టరో అందరికి తెలుసు. అశోక్ డిజాస్టర్ అయితే... ఆ కాంబోలో వచ్చిన మరో సినిమా ఊసరవెల్లి సినిమాకి ప్రమోషన్స్ లేకపోవడం వలన నిర్మాతకి డబ్బులు రాలేదు. అయితే .. ఎన్టీఆర్‌తో అశోక్ తీసిన చాలా కాలం తర్వాత.. ఇప్పుడు ఆ సినిమా ఎందుకు తియ్యాల్సి వచ్చిందో తెలిపారు సురేందర్ రెడ్డి. అసలు తనకిష్టం లేకుండా ఆ సినిమా చేసానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌తో సురేందర్ రెడ్డి చేసిన అశోక్ సినిమాని సురేందర్ రెడ్డి ఇష్టపడి చేయలేదట. బలవంతం మీద ఒప్పుకున్నాడట.
ఎన్టీఆర్ మేనేజర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని.. తన వెంట తిరిగాడని, లేదంటే తాను ప్రభాస్‌తో సినిమా చేసేవాడినని.. ఎన్టీఆర్ మేనేజర్ ఎన్టీఆర్‌తో సినిమా చెయ్యాలంటూ ఒత్తిడి తేవడమే కాకుండా తనని అక్కడిక్కడికి తిప్పాడని, అసలు తాను ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని చెప్పకుండానే.. ఎన్టీఆర్‌తో సినిమా ఎలా చేద్దాం, ఎక్కడ చేద్దామంటూ మాట్లాడడంతో... కాస్త ఇబ్బందిపడినా.. ఎన్టీఆర్ కూడా స్టార్ హీరో కాబట్టి.. తాను ఎన్టీఆర్‌తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నానని చెప్పుకొచ్చారు.
అసలు అశోక్ కథ తనది కాదని, ఎన్టీఆర్ కోసం అశోక్ కథ వారు ముందే రెడీ చేయించుకున్నారని, ఇక ప్రభాస్ కోసం మరో కథని అనుకున్న తాను ఎన్టీఆర్ కోసమే అశోక్ సినిమా చెయ్యాల్సి వచ్చిందని, అశోక్ కథ తనకి సెట్ అయ్యేది కాకపోయినా.. ఇష్టం లేకుండానే ఆ సినిమా చేసానని చెబుతున్నాడు. మరి నిజంగా ఎన్టీఆర్ అశోక్ కథతో తనకో మాస్ సినిమా చెయ్యమని సురేందర్ రెడ్డి వెంటపడి ఉంటాడా...? మరి సురేందర్ రెడ్డి చెప్పేది చూస్తుంటే... ఎన్టీఆర్ బలవంతంగా ఒప్పించినట్టే కనబడుతుంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.