Advertisement
Google Ads BL

బాబోయ్.. నాకేం రోగం లేదు: మెగా హీరో


మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరో సాయి ధరమ్‌ తేజ్‌. ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన.. కొన్ని సూపర్ డూపర్‌ హిట్‌లు కాగా.. మరికొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. పెద్దగా ఒడిదుడుకులు ఏమీ లేనప్పటికీ తేజ్ సినీ కెరీర్ సాఫీగానే సాగుతోంది. ఇక అసలు విషయానికొస్తే.. తేజ్, రాఖీఖన్నా నటీనటులుగా కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా పేరుగాంచిన మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. సత్యరాజ్‌, రావు రమేష్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా.. ‘ప్రతి రోజు పండగే’ షూటింగ్‌ ఫైనల్‌కు చేరుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Advertisement
CJ Advs

వాస్తవానికి మారుతి సినిమా అంటే హీరోకు ఏదో ఒక జబ్బు తగిలిస్తుంటాడు.. జబ్బు అంటే మరేదో అనుకునేరు. అదేం కాదండోయ్.. భలే భలే మగాడివోయ్‌ సినిమాలో నేచురల్ స్టార్ నాని మతిమరపు.. బాబు బంగారం సినిమాలో వెంకటేష్‌ అతి మంచితనం.. మహానుభావుడు సినిమాలో శర్వానంద్‌ ఓసీడీ (అతి శుభ్రత) ఇలా ఏదో ఒక జబ్బు హీరోకు తగిలిస్తుంటాడు. అయితే ఇదే సినిమాకు ప్లస్ అయ్యి సూపర్ డూపర్ హిట్టయ్యాయ్ కూడా. 

అయితే తాజాగా.. తేజ్‌తో సినిమా కావడంతో ఆయనకు ఏ జబ్బు తగిలించాడా..? అని మారుతి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఒకింత ఆలోచనలో పడ్డారు. కొందరైతే ఇదుగో తేజ్ పాత్ర ఇలా ఉండబోతోంది..? పాత్రేంటో తెలిసిపోయిందంటూ నెటిజన్లు.. పలు వెబ్‌సైట్స్ రకరకాలుగా వార్తలు రాసేశాయ్. అయితే ఈ వ్యవహారంపై తాజాగా మెగా హీరో క్లారిటీ ఇచ్చుకున్నాడు. ‘బాబోయ్.. మారుతి సినిమాలో నాకు ఎలాంటి రోగం లేదు.. అంతా ఓకే.. సినిమాలో అలాంటివేమీ లేవు. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. పుకార్లు వస్తున్నాయ్.. వాటిని నమ్మకండి’ అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. సో.. మొత్తానికి చూస్తే మారుతి హీరోకి ఏ రోగం లేకుండా.. ఓ సినిమా చూడబోతున్నాం. మరి ఇదెలా ఉంటుందో ఏంటో రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Sai Dharam Tej About His role in Prathiroju Pandage Movie:

Sai Dharam Tej Reacted on Rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs