Advertisement
Google Ads BL

ద్యావుడా.. ‘అసురన్’ రీమేక్‌కు ఈ డైరెక్టరా!


తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘అసురన్’. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఇప్పటికే కలెక్షన్ల పరంగా రూ.100 కోట్లు దాటేసింది కూడా. ఈ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. దీంతో తెలుగు, బాలీవుడ్‌తో పాటు మరికొన్ని రీమేక్‌ హక్కుల కోసం క్యూ కట్టి ఎట్టకేలకు సాధించుకున్నారు. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఆ తర్వాత మళ్లీ రీమేక్‌ అవసరమా అని వెనకడుగేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక అవన్నీ అటుంచితే ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌కు ఫలానా డైరెక్టరట అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 

Advertisement
CJ Advs

అయితే ఎటూ తేల్చుకోలేక ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఏ దర్శకుడికి అప్పగించాలా అనే తర్జనభర్జనలు నడుస్తున్నాయి. అయితే తాజాగా.. మరో దర్శకుడి పేరు ప్రచారం జరుగుతోంది. ఆయన మరెవరో కాదు.. శ్రీకాంత్ అడ్డాల. వెంకటేశ్‌తో ఉన్న సాన్నిహిత్యంతో కారణంగా ఆయన్ను కలిసిన శ్రీకాంత్.. ఈ అవకాశం తనకు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఒకే ఒక్క చాన్స్ ఇస్తే ఈ రీమేక్‌తో మళ్లీ తనకు పాత రోజులు వస్తాయని కూడా వెంకీతో చెప్పారట. వాస్తవానికి కుటుంబ నేపథ్యంలో సాగే కథలను, భావోద్వేగంతో కూడిన సన్నివేశాలను తెరకెక్కించడంలో శ్రీకాంత్ అడ్డాలకు అందవేసిన చేయి అనే విషయం విదితమే. 

అందుకే ఈ క్రమంలో వెంకీని కలిసిన అడ్డాల.. రీమేక్ గురించి చర్చించారట. అంతేకాదు మీరే దగ్గరుండి మరీ.. నిర్మాత సురేష్ దగ్గుబాటిని ఒప్పించాలని కోరారట. మరి వెంకీ మనసులో ఏముందో..? వెంకీ ఓకే అన్నా.. అన్న సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో..? శ్రీకాంత్ అడ్డాలకు ముద్ర పడటంతో పరిస్థితి ఎలా ఉంటుందో అనేది తెలియాలంటే వేచి చూడాలి మరి. అయితే శ్రీకాంత్ అడ్డాలకు ఈ బాధ్యతలు అప్పగిస్తారా.. ద్యావుడా.. అంటూ దగ్గుబాటి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారట.

Viral Gossip: Srikanth Addala to direct Asuran remake with Daggubati Venkatesh:

Viral Gossip: Srikanth Addala to direct Asuran remake with Daggubati Venkatesh  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs