Advertisement
Google Ads BL

ఇది నా లైఫ్‌లో మరిచిపోలేను: మురగదాస్


సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో ‘దర్బార్’ చేయడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ - స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్

Advertisement
CJ Advs

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ‘దర్బార్’.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే  రిలీజ్ అయిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్ కి ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండ‌స్  రెస్పాన్స్ వ‌స్తోంది. లేటెస్ట్ గా  ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సూపర్ స్టార్ రజిని నవంబర్ 14 నుండి డబ్బింగ్ స్టార్ట్ చేసి నేటితో పూర్తి చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ మాట్లాడుతూ... ‘‘సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో దర్బార్ చేయడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే ఆయనతో చేసిన ఈ డబ్బింగ్ సెషన్ నా లైఫ్ లో మెమొరబుల్.’’ అన్నారు.

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌

Rajinikanth Completed Dubbing for Darbar:

A.R. Murugadoss Feeling About Movie with Rajinikanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs