Advertisement
Google Ads BL

రాహుల్-పున్ను మూవీకి డైరెక్టర్, నిర్మాత రెడీ!


తెలుగు రియాల్టీ షో బిగ్ ‌బాస్-3 లవర్స్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. నటి పునర్నవీ భూపాలం వ్యవహారం గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వీళ్లు హౌస్‌లో ఎలా అయితే హాట్ టాపిక్ అయ్యారో.. రాహుల్ విన్నర్‌గా బయటికొచ్చిన తర్వాత కూడా అంతే హడావుడి జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల్ సిప్లిగంజ్‌ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. దీంతో సినిమాల్లో నటించాలని పలువురు ఇప్పటికే తనను సంప్రదించారని రాహుల్ స్వయానా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు.. పునర్నవీ తాను నటీనటులుగా సినిమాలో నటించాలని ఉందని.. ఆ అవకాశం వస్తే అస్సలు మిస్ చేసుకోనని.. కచ్చితంగా నటిస్తానని కూడా అదే ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను రాహుల్ బయటపెట్టాడు.

Advertisement
CJ Advs

అయితే అలా రాహుల్ ఇంటర్వ్యూలో చెప్పాడో లేదో.. తథాస్తు అన్నట్లుగా మీ ఇద్దర్నీ హీరోహీరోయిన్లుగా పెట్టి సినిమా తీయడానికి నేను రెడీగా ఉన్నానని ఓ యువ దర్శకుడు ముందుకొచ్చాడట. ఆ డైరెక్టర్ ఇదివరకూ పలు హిట్ షార్ట్ ఫిల్మ్‌లు తెరకెక్కించాడట. అంటే ఫుల్‌ లెంగ్త్ మూవీ ఈ జంటతోనే అన్నమాట. అంతేకాదు.. స్వయంగా ఓ నిర్మాత రాహుల్ దగ్గరికొచ్చి మీ ఇద్దరితో సినిమా తీయడానికి నేనూ రెడీగా ఉన్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ నిర్మాత కూడా టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరని సమాచారం. సో.. రాహుల్ ఫుల్ హ్యాపీ అన్నమాట.

మీరిద్దరూ రెడీ అంటే.. డైరెక్టర్‌ను తీసుకొచ్చి కథ వినిపిస్తానని.. ఓకే అయ్యిందంటే.. డిసెంబర్‌లో షూటింగ్ షురూ చేద్దామని రాహుల్‌కు ఆ నిర్మాత చెప్పారట. మరి ఇవన్నీ పుకార్లుగానే మిగిలిపోతాయా..? లేకుంటే సినిమా తెరకెక్కే పరిస్థితులుంటాయా..? రాహుల్ ఒప్పుకుంటాడు సరే.. మరి పునర్నవీ పరిస్థితేంటి..?. అసలు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుందా..? లేదా..? అనేది తెలియాలంలే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Director and Producer Ready for Rahul and Punarnavi combo film:

Very Soon.. Movie in Rahul and Punarnavi Combo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs