రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా షూటింగ్ జెట్ స్పీడుతో సాగుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు రాజమౌళికి సదా అవైలబుల్ అంటూ టైం ఇచ్చెయ్యడంతో.. రాజమౌళి కూడా హుషారుగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్‌లలో ఎవరికీ ఎక్కువ తక్కువ కాకుండా రాజమౌళి చాలా బేలెన్సుడ్ గా అభిమానులు హార్ట్ కాకుండా ఉండేలా ప్రతి ఒక్క విషయాన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడని అంటున్నారు. అయితే RRR లుక్స్ విషయంలో రామ్ చరణ్ లుక్ ముందా? ఎన్టీఆర్ లుక్ ముందా? అంటూ మొన్నామధ్యన సోషల్ మీడియాలో హంగామా జరిగింది.
ఇకపోతే ఇప్పటివరకు ఎన్టీఆర్ కోసం హీరోయిన్ ని ఫైనల్ చేయలేదట రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలెట్టినప్పుడే హాలీవుడ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటే.. ఆమె హ్యాండ్ ఇవ్వడంతో.. రాజమౌళి మళ్ళీ ఇంతవరకు ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో ఇంకా తర్జన భర్జనలు పడుతూనే ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ కి హీరోయిన్ ని సెట్ చెయ్యని కారణంగా.. ముందు రామ్ చరణ్ - అలియా భట్ ల సీన్స్‌ని కంప్లీట్ చేసేసి, తర్వాత రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబో సీన్స్ కూడా ఫినిష్ చేసాక ఎన్టీఆర్ కి హీరోయిన్ ని సెట్ చేసి వారి కాంబో సీన్స్ మీద దృష్టి పెడతాడని తెలుస్తుంది. అంటే RRR షూటింగ్‌లో రామ్ చరణ్ ఫస్ట్ అయితే... ఎన్టీఆర్ లాస్ట్ అన్నమాట.