Advertisement
Google Ads BL

అవార్డ్స్ ఫంక్షన్‌లో అక్కినేని కోడలేది?


ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నేషనల్ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ నుండి రేఖ, బోనికపూర్, మహేశ్వరి రాగా.. ముఖ్య అతిధిగా చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ అంతా.. ఈ వేడుకకి విచ్చేసిన అతిరథమహారధులని దగ్గరుండి ఆహ్వానం పలికారు. అఖిల్, నాగ చైతన్య, నాగ సుశీల, సుప్రియ, సుమంత్, సుశాంత్, నాగార్జున, అమల.... రేఖ, చిరు, సుబ్బరామిరెడ్డి, విజయ్ దేవరకొండలను దగ్గరుండి... అందరినీ ఆహ్వానించారు. ఈ వేడుకలో రేఖకి, శ్రీదేవికి ఏఎన్నార్ అవార్డ్స్ 2018 -19కిగాను చిరు చేతుల మీదుగా అందించారు. రేఖ ఈ అక్కినేని పురస్కారాన్ని అందుకోగా... శ్రీదేవి పురస్కారాన్ని ఆమె భర్త బోనికపూర్ అందుకుని.. శ్రీదేవి తనతో లేకపోవడం బాధాకరమంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement
CJ Advs

అయితే ఇంత పెద్ద వేడుకకి అక్కినేని వారి క్రేజీ కోడలు సమంత మాత్రం హాజరవలేదు. కారణాలు తెలియవు కానీ.. సమంత మాత్రం ఈ అక్కినేని ఫ్యామిలీ సభ్యులలో లేని లోటు అందరికి స్పష్టంగా తెలిసింది. మంచు లక్ష్మి, నిహారిక వంటి వారు వచ్చినప్పటికీ... అందరి కళ్ళు సమంత రాక మీదే ఉన్నాయి. కానీ ఎందుకో సమంత మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. సమంత కూడా ఈ వేడుకకి హాజరై ఉంటే.... ఫంక్షన్ ఇంకా సందడిగా మారేదని అంటున్నారు. ఇక మిగిలిన అక్కినేని ఫ్యామిలీ సభ్యులంతా ఈ ఏఎన్నార్ అవార్డ్స్ ఫంక్షన్ లో సందడి చేశారు. ఈ వేడుకకి హీరో విజయ్ దేవరకొండ హైలెట్ గా నిలిచాడు. ఈ వేడుకని లైవ్ ఇచ్చిన ఛానల్ వారు కూడా ఎక్కువుగా విజయ్ దేవరకొండనే హైలెట్ చేస్తూ చూపించారు. ఇంకా అఖిల్, చైతు లు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. 

No Samantha at ANR National Award Function:

ANR Awards Function: Samantha Missing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs