Advertisement
Google Ads BL

‘90ml’.. ‘సింగిల్’ పాటకు మంచి స్పందన!


హీరో కార్తికేయ ‘90ml’  ‘సింగిలు సింగిలు’ పాట విడుదలకి ఫోరమ్ సుజనా మాల్ లో భారీ స్పందన!!

Advertisement
CJ Advs

హీరో కార్తికేయ నటించిన ‘90ml’  ‘సింగిలు సింగిలు’ పాటని భారీ జనసందోహం మధ్య ఫోరమ్ సుజనా మాల్ లో 17 నవంబర్ శనివారం రాత్రి హైదరాబాద్ విడుదల చేశారు.

ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ చిత్రంలో నటించిన రోల్ రైడా మరియు దర్శకుడు శేఖర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో ప్రాంగణమంతా ఈలలు, అరుపులతో ఉర్రూతలూగిపోయింది.

ఇదివరకు విడుదలైన ‘ఇనిపించుకోరు ఇనిపించుకోరు’, ‘చాలు చాలు’ పాటలు ఇప్పటికే జనాల నుండి మంచి ఆదరణ పొందుతుండగా ఇప్పుడు విడుదలయిన ఈ పాట సింగిలు సింగిలు అని సాగుతూ సింగిల్ యువతని విపరీతంగా ఆకట్టుకోనుంది.

ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి గుమ్మకొండ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తుండగా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలకి సిద్ధంగా ఉంది.

న‌టీన‌టులు:

కార్తికేయ‌, నేహా సోలంకి, ర‌వికిష‌న్‌, రావు ర‌మేష్‌, అజయ్, ఆలీ, ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, అదుర్స్ ర‌ఘు, స‌త్య ప్ర‌కాష్‌, రోల్ రిడా, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, దువ్వాసి మోహ‌న్‌.

సాంకేతిక నిపుణులు:

రచన-దర్శకత్వం: శేఖర్ రెడ్డి ఎర్ర, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా:  జె.యువ‌రాజ్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్:  జీఎం శేఖ‌ర్‌, పాట‌లు:  చంద్ర‌బోస్‌, ఫైట్స్:  వెంక‌ట్‌, జాషువా, కొరియోగ్ర‌ఫీ:  జానీ, కో-డైరెక్టర్:  బాస్ గూడూరి(సిద్ధు), ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె.సూర్య‌నారాయ‌ణ‌.

Superb Response to 90 ML Movie Single Song:

Karthikeya Movie 90ML song Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs