Advertisement
Google Ads BL

పవన్ వస్తే కష్టం.. ‘జార్జిరెడ్డి’కి షాకిచ్చిన పోలీసులు!


‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో  ‘జార్జి రెడ్డి’ బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా .. విద్యార్థుల తరఫున పోరాడిన నాయకుడిగా ‘జార్జి రెడ్డి’ కి యూత్‌ మనసులో స్థానం సంపాదించుకున్నారు. అయితే విధి ఆడిన వింతనాటకంలో 25 ఏళ్ల వయసులోనే ఆయన ప్రత్యర్థుల చేతిలో కన్నుమూశాడు. ఇలాంటి కథను తెరకెక్కించాలని భావించి.. ధైర్యం చేసి మరీ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించి తెరకెక్కించారు. ఇప్పటికీ చిత్రానికి సంబంధించి అన్ని పనులు అయిపోగా.. నవంబర్ 22న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తామని దర్శకనిర్మాతలు డేట్ ఫిక్స్ చేశారు. రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని భావించిన చిత్రబృందం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

Advertisement
CJ Advs

సడెన్‌గా ఈవెంట్ రద్దు!?

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఇప్పటికే నెక్లస్ రోడ్‌లో ఏర్పాట్లన్నీ చిత్రబృందం గ్రాండ్‌గా చేసింది. అయితే ఈ క్రమంలో దర్శకనిర్మాతలకు ఊహించని విధంగా తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నాం అనేదానికి పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ వస్తున్నందున లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని పోలీసులు చెబుతున్నారు. జార్జిరెడ్డి ఉద్యమకారుడు కావడంతో స్టూడెంట్ యూనియన్లు, పెద్ద ఎత్తున యువత, ఉస్మానియా విద్యార్థులు హాజరవుతారు. అంతేకాదు.. పవన్ వస్తే ఆయన పార్టీ కార్యకర్తలు, మెగాభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరైతే లా అండ్ ప్రాబ్లమ్ వస్తుందని అనుమతిని నిరాకరిస్తున్నామని పోలసులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై చిత్రబృందం ఇంకా రియాక్ట్ అవ్వలేదు. ఈవెంట్ మరో చోట ఉంటుందా..? లేకుంటే అసలే ఉండదా..? అనేదానిపై దర్శకనిర్మాతలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Pawan Kalyan Effect: No Permission to George Reddy Event:

Police permission denied for OU Student Leader biopic George Reddy Pre - Release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs