Advertisement
Google Ads BL

ఆమని బర్త్‌డే స్పెషల్: ‘అమ్మ‌దీవెన’ ఫస్ట్ లుక్


ఆమని పుట్టినరోజు సందర్భంగా ‘అమ్మ‌దీవెన’ ఫస్ట్ లుక్ విడుదల

Advertisement
CJ Advs

ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి  గుర‌వ‌య్య నిర్మాత‌లుగా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అమ్మ‌దీవెన’. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఆమ‌ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 16న శ‌నివారం ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో  మేయ‌ర్  బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీ‌దేవి, మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య‌ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా  ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో...

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి శుభ సంద‌ర్భంలో పోస్ట‌ర్‌ని విడుద‌ల చెయ్య‌డం చాలా సంతోషంగా ఉంది. నా మిత్రులు చిన్న మారయ్య గుర‌వ‌య్య ప్రొడ్యూసర్స్ గా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో  ఈ చిత్రం వ‌స్తుంది. ఎటువంటి దీవెన అయినా త‌క్కువ‌వ్వొచ్చు కాని ‘అమ్మ‌దీవెన’ ఎక్క‌డా తక్కువ‌కాదు. ఈ చిత్రంలో అమ్మ పాత్ర‌లో న‌టిస్తున్న ఆమ‌ని గారికి అభినంద‌న‌లు తెలియజేస్తున్నా’’ అన్నారు.

ప్రముఖ నిర్మాత డి.ఎస్‌రావు  మాట్లాడుతూ... ‘‘తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ మంచి పేరు తెచ్చుకున్న. ఆమని గారు  ఈ చిత్రంలో  న‌టించ‌డం ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాల‌ని కోరుకుంటున్నాను. ఇంత మంచి సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్స్ ని అభినందిస్తున్నాను. ఈ సినిమా పేరు వింటుంటే మాతృదేవోభ‌వ‌ సినిమా గుర్తుకువ‌స్తుంది. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అయి ప్రొడ్యూస‌ర్లు ఇంకా మ‌రెన్నో చిత్రాలు తియ్యాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

శ్రీ‌దేవి బొంతు మాట్లాడుతూ... ‘‘ఈ రోజు నిజంగా అమ్మ‌దీవెన లాంటి మంచి చిత్రాన్ని నిర్మించిన  ప్రొడ్యూస‌ర్లు డైరెక్ట‌ర్ల‌కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా చాలా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవ్వాలని కోరుకుంటున్నా.  అమ్మ‌గారి పేరు మీద ప్రొడ్యూస‌ర్లు ఈ సినిమా తీశారు. పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను. సిసింద్రీ నాకు ఫేవరేట్ సినిమా.  ఆ సినిమాలో ఆమని గారు చాలా బాగా న‌టించారు. త‌ల్లి దీవెన‌లు ఉంటే మ‌నం ఎల్ల‌వేళ‌లా పై చేయి సాధిస్తాము’’ అన్నారు. 

నటి ఆమ‌ని మాట్లాడుతూ... ‘‘నేను ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాను. ఒక  త‌ల్లిగా ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించాము. ఒక తాగుబోతు మొగుడితో ఐదుగురు పిల్ల‌ల్ని పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు ప‌డుతుంది. ఈ చిత్రాన్ని నిర్మించి ప్రొడ్యూస‌ర్లు వాళ్ళ అమ్మ మీద ప్రేమ‌ని సినిమా ద్వారా తెలియజేస్తున్నారు. శివ‌ గారు ఈ సినిమా చెప్పిన‌ప్పుడు అన్ని సీన్స్ చాలా బావుంటాయి. కొన్ని స‌న్నివేశాలు చాలా  నాచ‌ర‌ల్‌గా తీశారు. శుభ‌సంక‌ల్పం తర్వాత ఈ సినిమాలోనే  డీ గ్లామ‌ర్ పాత్రలో న‌టించాను. మంచి కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. మాటలు, స్లాంగ్ అన్నీ బాగా కుదిరాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. హీరోయిన్ ప‌ల్ల‌వి చాలా బాగా న‌టించారు. పోసానిగారి పాత్ర ఈ సినిమాలో చాలా యాప్ట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో న‌టించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పుట్టిన‌రోజు నాడు పోస్ట‌ర్ రిలీజ్ కావ‌డం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. 

ద‌ర్శ‌కుడు  శివ ఏటూరి మాట్లాడుతూ... ‘‘నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌గారికి  ఎప్పటికీ రుణపడి ఉంటాను.  ఇది చాలా మంచి మూవీ ఈ నెలాఖరు లోపు ఆడియో  విడుద‌ల కాబోతుంది త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు.

నిర్మాత చిన మారయ్య మాట్లాడుతూ.. ‘‘తమ ఉన్నతికి కారణమైన తల్లికి గుర్తుగా చేసిన చిన్న  ప్రయత్నాన్ని మీడియా మిత్రులు ప్రోత్సహించాలని కోరారు.’’

ఆమని, పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, డి ఎస్ రావు, యశ్వంత్  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి 

దర్శకత్వం: శివ ఏటూరి,

నిర్మాతలు : ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి  గుర‌వ‌య్య,

మాటలు : శ్రీను. బి,

సంగీతం : ఎస్.వి.హెచ్,

డి ఓ పి : సిద్ధం మనోహర్,

ఎడిటర్ : జె.సి,

డాన్సులు : గణేష్ స్వామి, నాగరాజు, చిరంజీవి, ఫైట్స్ : నందు, పి.ఆర్ఓ. : సాయి సతీష్.

Senior actress Aamani starrer Amma Deevena First look is out:

Aamani Birthday Special: Amma Deevena First look Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs