Advertisement
Google Ads BL

ఫస్ట్ డే మార్నింగ్ షో ఉచితం అంటున్నారు


నవంబర్ 22న బీచ్ రోడ్ చేతన్ విడుదల, ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఏపీ, తెలంగాణలో ఉచితంగా ఇస్తున్నాము - చేతన్

Advertisement
CJ Advs

రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు, చిత్రాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ర అండ్ రియలిస్టిక్ రస్టిక్ ఫిలిం “బీచ్ రోడ్ చేతన్”. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను నవంబర్ 16న విడుదల చేసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేనితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

చిత్ర విలన్ నిర్మల్ భాను మాట్లాడుతూ... అందరికి కల ఉంటుంది, వాటిని సాకారం చేసుకోవాలంటే సరైన పర్సన్స్ కావాలి. చేతన్ నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చాడు. నేను ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాను. ఈ చిత్రంలో నటించిన అందరూ బాగా చేశారు, అందరూ కలసి ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా తీసాము. చేతన్ అన్ని పాత్రలు బాగా డిజైన్ చేసాడు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను మీ అందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు.

కో డైరెక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ... నాకు ఈ అవకాశం ఇచ్చిన చేతన్ కు థాంక్స్. ఈ సినిమా హైదరాబాద్, వైజాగ్ లో చిత్రీకరణ జరిగింది. 150 మంది కొత్త ఆర్టిస్ట్స్ ఈ సినిమాలో నటించారు. అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ మూవీలో నటించిన అందరూ నటీనటులు బాగా చేశారు. 22న వస్తోన్న మా సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా అన్నారు.

ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ... నవంబర్ 22న మా బీచ్ రోడ్ చేతన్ విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఏపీ, తెలంగాణలో ఉచితంగా ఇస్తున్నాము. దాదాపు 200 థియేటర్స్ లో మా సినిమా విడుదల కాబోతోంది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుండి మా సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తుందని భావిస్తున్నాను. ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో మీ ముందుకు వస్తున్నాము, టీజర్ అందరికి నచ్చింది, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.  22న రాబోతున్న మా సినిమా మీకు నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

హీరో: చేతన్ మద్దినేని

హీరోయిన్: తేజ రెడ్డి

టెక్నీషియన్స్:

మాటలు: చేతన్ మద్దినేని, పాటలు: బి. రాజారత్నం, ఎడిటర్: యం.ఆర్. వర్మ, డిఒపి: నిశాంత్ రెడ్డి, సంగీతం: శామ్యుల్ జె.బెనయ్య, ఫైట్స్: రియల్ సతీష్, నిర్మాత-దర్శకత్వం: చేతన్ మద్దినేని.

Beach Road Chetan Ready to Release:

Beach Road Chetan 1st Day Morning Show Free in Telugu States
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs