అవును మీరు వింటున్నది నిజమే.. మెగా బ్రదర్ నాగబాబు కంటే.. వైసీపీ ఎమ్మెల్యే రోజానే ఎక్కువగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటోందట. పూర్తి వివరాల్లోకెళితే.. గత కొన్ని రోజులుగా రోజా, నాగబాబు ఇద్దరూ జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారని.. ఆల్రెడీ చెప్పేశారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ క్రమంలో అసలు రోజా ఇన్ని రోజులు ఎన్ని లకారులు పుచ్చుకున్నారు..? నాగబాబు సంగతేంటి..? ఇందులో కమెడియన్స్‌గా చేసేవారికి ఎవరెవరికి ఎంతెంత యాజమాన్యం చెల్లిస్తోంది అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఎవరెంత పుచ్చుకుంటున్నారో ఈ కథనంలో చూద్దాం.
అటు ఈ టీవీ.. ఇటు మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్‌కు ‘జబర్దస్త్’ కతర్నాక్ కామెడీ షో ఊపిరిలాంటిది!. అనే విషయం తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే జబర్దస్త్ వల్లే మల్లెమాల బతికి బట్టకడుతోందని కూడా కొందరు పెద్దలు చెబుతుంటారు. ఈ షో ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో.. ఎంతమందిని ఉన్నతస్థాయికి చేర్చిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకుంటారన్నది ఇప్పటికీ గుట్టుగానే ఉంది. తాజాగా ఓ జాబితాలో ఎవరెంత పుచ్చుకుంటున్నారో పూర్తి వివరాలతో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఎవరెవరికి ఎంత..!?
- మెగా బ్రదర్ నాగబాబు : రూ.15 లక్షలు (నెలకు)
- ఎమ్మెల్యే రోజా శెల్వమణి : రూ. 20 లక్షలు (నెలకు)
- యాంకర్ అనసూయ : రూ.3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు (నెలకు)
- యాంకర్ రష్మీ : రూ. 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు (నెలకు)
ఇక కమెడియన్స్ కమ్ టీమ్ లీడర్స్ విషయానికొస్తే..
- చమ్మక్ చంద్ర : రూ. 4 లక్షలు
- సుడిగాలి సుధీర్ : రూ.3.5 లక్షలు
- అదిరే అభి : రూ. 3 లక్షలు
- రాంప్రసాద్ : రూ. 3 లక్షలు
- హైపర్ ఆది : రూ. 3 లక్షలు
- గెటప్ శ్రీను : రూ. 2.5 లక్షలు
- రాకెట్ రాఘవ : రూ. 2.5 లక్షలు
- కిరాక్ ఆర్పీలు : రూ. 2.5 లక్షల
- బుల్లెట్ భాస్కర్ : రూ. 2 లక్షలు పుచ్చుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు మాత్రం ఇచ్చుకునే యాజమాన్యానికి.. పుచ్చుకునే వీళ్లకే ఎరుక మరి.