ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6న ‘ప్రెషర్ కుక్కర్’ గ్రాండ్ రిలీజ్
సాయి రోనక్, ప్రీతి అర్సాని హీరో హీరోయిన్లుగా సుజోయ్, సుశీల్ దర్శక ద్వయం తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. కరంపురి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాలపై సుజోయ్, సుశీల్, అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘అభిషేక్ పిక్చర్స్’ అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా కథ నచ్చడంతో ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా టీజర్‌ను కట్ చేసి రిలీజ్ చేశారు. ఆ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా నగేష్ బానెల్, అనిత్ మడాడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
సాయిరోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ, రజయ్ రోవాన్, తనికెళ్ల భరణి, సీవీఎల్ నరసింహారావు తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: సుజోయ్, సుశీల్
నిర్మాతలు: సుశీల్, సుజోయ్, అప్పిరెడ్డి
సినిమాటోగ్రపీ: నగేష్ బానెల్, అనిత్ మడాడి
సంగీతం: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్ రామేశ్వర్
బీజీఎం: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: నరేష్ రెడ్డి జొన్న
పి.ఆర్.ఒ: వంశీశేఖర్