Advertisement
Google Ads BL

‘తోలుబొమ్మలాట’ విడుదలకు రెడీ..!


కుటుంబ కథా చిత్రం ‘తోలుబొమ్మలాట’ సెన్సార్ పూర్తి,  ఈ నెల 22 న విడుదల!!

Advertisement
CJ Advs

డా. రాజేంద్రప్రసాద్‌ నటించిన కుటుంబ కథా చిత్రం ‘తోలుబొమ్మలాట’ సెన్సార్ పూర్తి చేసుకుని  ఈ నెల 22 న విడుదల కానుంది. విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి నిర్మించారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు.

నిర్మాత దుర్గాప్రసాద్‌ మాగంటి మాట్లాడుతూ... ‘‘ఒక కుటుంబంలోని మూడు తరాల మధ్య జరిగే దోబూచులాటలాంటిది ఈ సినిమా. అవసరాలు, అపోహలు, అపార్థాలు, కలలు, కన్నీళ్లు, కలవరాలు, కల్లోలాలు, అభిమానాలు, ఆత్మాభిమానాలు వంటి భావోద్వేగాల కలబోత ఈ చిత్రం. ఒక కుర్రాడు ఇంత లోతైన, ఉద్వేగభరితమైన భావాలున్న కుటుంబ కథని ఎలా ఎదుర్కొని, పరిష్కరించాడు అని రేపు తెరపై చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. థ్రిల్‌ ఫీలవుతారు. ఏ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కచ్చితంగా అందరి హృదయాల్లో స్థానం సంపాదిస్తుందని మా నమ్మకం. ఇటీవల విడుదలయిన ట్రైలర్ కి మరియు పాటలకి మంచి స్పందన లభించింది. ఓవర్సీస్ విడుదల హక్కులను గోల్డెన్ ఈగిల్ ఫిలిమ్స్ ఎల్.ఎల్.సి వారు పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నారు’’ అని చెప్పారు.

నటీనటులు:

డా. రాజేంద్రప్రసాద్‌ , విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌, సంగీత, కల్పన, శిరీష సౌగంద్‌, ధన్‌రాజ్‌, పూజా రామచంద్రన్‌, నారాయణరావు, చలపతిరావు, ప్రసాద్‌బాబు, ‘తాగుబోతు’ రమేష్‌, ‘బస్టాప్‌’ కోటేశ్వరరావు, అల్లు రమేష్‌ తదితరులు.

సాంకేతికనిపుణులు:

ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు

ఆర్ట్: మోహన్‌.కె.తాళ్లూరి

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేష్‌ నూకవల్లి

Tholubommalaata Censor Completed:

Tholubommalaata Censor Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs