శ్రీరెడ్డి.. ఈమె గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వివాదాలు రేపాలన్నా.. సెలబ్రిటీల భాగోతం బయటపెట్టాలన్నా ఈమె ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే పలువురికి సంబంధించిన బాగోతాలను కళ్లకు కట్టినట్లుగా ఫొటోలతో సహా బయటపెట్టింది ఈ హాట్ బ్యూటీ. అయితే ఆ మధ్య లాంగ్ గ్యాప్ ఇవ్వడంతో హమ్మయ్యా.. ఇక మనం సేఫ్ అని శ్రీరెడ్డి బాధితులంతా ఊపిరిపీల్చుకున్నారు. అంతేకాదు.. హాట్ హైదరాబాద్ వదిలేసి చెన్నై చెక్కేయడంతో ఈమెతో గడిపిన వాళ్లు అప్పట్లో పండుగ చేసుకున్నారు. చెన్నై వెళ్లినప్పటికీ అప్పుడప్పుడు అలా ఓ చూపు చూస్తూ కొందరి కథలన్నీ బయటపెడుతూ వస్తోంది.
ఇక పాయింట్‌కు వస్తే... చెన్నై వెళ్లిన ఈ హాట్ బ్యూటీ ఇళ్లు కొని.. అక్కడ కొన్ని కొన్ని సినిమాలకు సైన్ చేసి.. తెలుగులో ‘క్లైమాక్స్’ చూపిస్తానంటూ ప్రేక్షకుల ముందుకొస్తోంది. హైదరాబాద్ టూ చెన్నై వెళ్లినా ఈమె మాత్రం శ్రీరెడ్డి సీరియల్ అన్నట్లుగా.. ఎపిసోడ్‌లు వారిగా అక్కడి డైరెక్టర్స్, హీరోల బతుకులు ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తోంది. ఇప్పటికే లారెన్స్, విశాల్ లాంటి స్టార్ హీరోలను విమర్శించి హాట్ టాపిక్ అయ్యింది. అయితే తాజాగా.. తమిళ్ హీరో, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి మనువడు ఉదయనిధి స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ.. ఆయనతో శ్రీరెడ్డికి ఉన్న సత్సంబంధాన్ని ఫేస్‌బుక్ వేదికగా రాసుకొచ్చింది.
‘హాయ్ తమిళ్ యాక్టర్ ఉదయనిధి స్టాలిన్ సార్..మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సినిమా షూటింగ్‌లో విశాల్ నుంచి స్టాలిన్‌ను కలిసాను. ఆ తర్వాత అవకాశం ఇప్పిస్తానని చెబితే... గ్రీన్ పార్క్ హోటల్‌లో రాత్రంతా అతనితో లైంగికంగా కలిసాను. అంతేకాదు.. ఆ రాత్రంతా ఎన్నో ఎన్నెన్నో చేశాం కదా స్టాలిన్ గారూ.. కానీ ఇప్పటి వరకు మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఆ రోజు మీరు నేను గడిపిన ఆ రాత్రి అస్సలు మరిచిపోరేమో..?’ అంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఈ భామను స్టాలిన్ పట్టించుకుంటారో..? లేకుంటే అబ్బే అదేం లేదు లైట్ తీసుకుంటారో..? బహుశా లైట్ తీసుకున్నా కూడా గెలకడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్యే.. రేపొద్దున ఫొటోలు బయటపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!