Advertisement
Google Ads BL

అస్సలు తగ్గేదేలేదంటున్న ప్రభాస్..!


బాహుబలిని ప్రభంజనం చూసి.. సాహో తీసిన ప్రభాస్‌కి ఆ సినిమా పెద్ద షాకిచ్చింది. ‘సాహో’ సినిమాకి ఎడా పెడా బడ్జెట్ పెట్టి చేతులు కాల్చుకోవడమే కాదు... ఏకంగా ప్రభాస్ 50 కోట్లకు పైనే నష్టపోయాడనే అన్నారు. సాహో దెబ్బ తగలడం, తర్వాత చిరు సైరా కి అదే పరిస్థితి రావడంతో ప్రభాస్ తన తదుపరి చిత్రం జాన్ బడ్జెట్ విషయంలో పునరాలోచనలో పడినట్లుగా వార్తలొచ్చాయి. జాన్ సినిమా బడ్జెట్ తగ్గించమని పెదనాన్న కృష్ణంరాజుకు ప్రభాస్ చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. ఇక 1960 కాలంనాటి బ్యాగ్డ్రాప్‌తో సాగే ఈ సినిమాని ఎక్కువగా యూరప్‌లో తెరకెక్కించడం వలన ఖర్చు పెరుగుతుందని...  యూరప్ సెట్‌ని హైదరాబాద్‌లో వెయ్యమని కూడా ప్రభాస్ చెప్పాడన్నారు.

Advertisement
CJ Advs

కానీ సాహోకి ఎంత నష్టమొచ్చినా ప్రభాస్‌లో ఎలాంటి మార్పులేదని, రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ చిత్రానికి గోపికృష్ణ మూవీస్ - యువి క్రియేషన్స్ వారు 180 కోట్ల పెట్టుబడి పెట్టడమే కాదు.. ఈ సినిమా కోసం రిచ్ గా 25 రకాల సెట్స్‌ను హైదరాబాద్‌లో వేయిస్తున్నారట. సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగ్ ఈ సెట్స్ లోనే చేయబోతున్నారట. అయితే ప్రభాస్ మళ్ళీ ధైర్యం చేస్తున్నది మాత్రం.. ఖచ్చితంగా హిందీ మార్కెట్ కోసమే అంటున్నారు. ప్రభాస్ జాన్ సినిమాని హిందీ ప్రేక్షకులు మెచ్చేలా తియ్యబోతున్నారట. సాహో సినిమా మిగతా భాషల్లో ప్లాప్ అయినా.. హిందీలో అదిరిపోయే కలెక్షన్స్ రావడంతో... ప్రభాస్ మళ్ళీ హిందీ మార్కెట్ మీద మనసు పారేసుకుని... జాన్ కి మళ్ళీ ఎడా పెడా పెట్టడానికి రెడీ అయ్యాడట.

Young Rebel Star Prabhas decision on Jaan Movie:

Jaan Movie Budget: Bollywood in Prabhas Mind
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs