Advertisement
Google Ads BL

ఇది టూ మచ్.. హర్ట్ అయిన మెగా బ్రదర్!?


అవును మెగా బ్రదర్ నాగబాబు హర్ట్ అయ్యారట. ఏంటండి మీరు మరీ టూ మచ్‌ పనులు చేస్తున్నారు..? ఇలాగైతే కష్టం నేను అస్సలు ఉండనని మొఖానే చెప్పేసి ఆగ్రహంతో ఊగిపోతూ బయటికొచ్చేశారని సమాచారం. అసలు నాగబాబు ఎక్కడ ఈ పనిచేశారు..? అసలేం జరిగింది..? ఇందులో నిజానిజాలెంత అనే ఆసక్తికర విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

అటు ఈ టీవీ.. ఇటు మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్‌కు ‘జబర్దస్త్’ కతర్నాక్ కామెడీ షో ఊపిరిలాంటిది!. ఒక్క మాటలో చెప్పాలంటే జబర్దస్త్ వల్లే మల్లెమాల బతికి బట్టకడుతోందని కూడా కొందరు పెద్దలు చెబుతుంటారు. ఈ షో ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో.. ఎంతమందిని ఉన్నతస్థాయికి చేర్చిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య కొన్ని చానెల్స్ కొత్త కొత్త షోలు పెట్టడం.. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు సిబ్బందిని లాగేసుకోవడం జరిగింది. దీంతో ఎవరెప్పుడు ఏ యాజమాన్యం కింద ఉంటారో..? ఎప్పుడు జంపింగ్స్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మల్లెమాలను నడుపుతున్న పెద్ద ఏం చేద్దాం.. అని కూర్చుని నిశితంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడట.

ఇక నుంచి మల్లెమాలలో పనిచేసే ప్రతి ఒక్కరూ సెక్యూరిటీ మొదలుకుని ఆర్టిస్ట్‌లు, జడ్జ్‌ల వరకూ ప్రతి ఒక్కరితో అగ్రిమెంట్ రాయించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. అంతేకాదు.. ఎవరొచ్చినా ఇదే రూల్ ‌ఫాలో అవ్వాలని కాస్త కటువుగానే చెప్పేశారట. మరీ ముఖ్యంగా నాగబాబుకు కూడా అగ్రిమెంట్ చేయాల్సిందేనని చెప్పడంతో.. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తనను నమ్మకపోవడమేంటి..? నన్ను అగ్రిమెంట్ అడుగుతారా.. ఇది టూ మచ్? అని బాబుగారు చాలా హర్ట్ అయ్యారట. అంతేకాదు యాజమాన్యం ఏ రేంజ్‌లో చెప్పిందో.. అంతకు డబుల్‌ రేంజ్‌లో ‘నేను ఇక షో చేయట్లేదు.. జడ్జిగా ఇక అస్సలు చేయను గాక చేయను’ అని చెప్పేసి బయటికొచ్చేశారట. వస్తూ వస్తూ పెండింగ్ ఉన్న పేమెంట్ మొత్తం వీలైనంత త్వరలో ఇచ్చేయాలని యాజమాన్యానికి చెప్పి వచ్చారట.

ఇప్పటికే వచ్చే ఏడాది నుంచి ఎమ్మెల్యే రోజా శెల్వమణి.. కూడా మానేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి తాజాగా నాగబాబుపై వస్తున్న పుకార్లు నిజమైతే బ్రదర్ ప్లేస్‌ను భర్తీ చేసేదెవరు..? రోజా సీటులో కూర్చునెదెవరు..? ఒకవేళ కొత్తగా జడ్జిలు వచ్చినా అది వర్కవుటయ్యేనా అనేది ఈటీవీ.. మల్లెమాల యాజమాన్యానికే తెలియాలి మరి.

Mega Brother Hurted with Jabardasth New Rule:

Mega Brother says goodbye to Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs