అల్లు అర్జున్ సినిమాకు హిందీలో భారీ డిమాండ్ ఉంది. అల్లు అర్జున్ సరైనోడు సినిమాకి హిందీ ప్రేక్షకులు యూట్యూబ్ లో బ్రహ్మరధం పట్టారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ కి హిందీ ప్రేక్షకులు ఫిదానే. అయితే ప్రస్తుతం అల వైకుంఠపురములో మాత్రం మేకర్స్ అనుకున్న రేటు మాత్రం హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కింద రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ప్రమోషన్స్ తో పాటుగా బిజినెస్ స్టార్ట్ చేసిన అల వైకుంఠపురములో నిర్మాతలు ఈ సినిమాకి హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 22 కోట్ల రేటు బాలీవుడ్ నిర్మాతలు చెప్పినట్లుగా తెలుస్తుంది.
కానీ ప్రస్తుతం తెలుగు సినిమాల జోరు హిందీలో కనిపించకపోవడంతో.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకి 19. 5 కోట్ల బేరం జరిగినట్టుగా టాక్. హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కింద 19.5 కోట్ల డీల్ సెట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే కేవలం త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబో మీదున్న నమ్మకం, ప్రస్తుతం అల వైకుంఠపురములో సాంగ్స్ మార్కెట్ ని ఊపేస్తున్న కారణంగానే అల వైకుంఠపురములో సినిమాకి ఈ భారీ రేటు దక్కిందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి అలతో పోటీపడుతున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కింద 15 కోట్లు డీల్ ఫిక్స్ అయ్యింది. అలా చూసుకుంటే మహేష్ మీద అల్లు అర్జున్ బెటరని అంటున్నారు.